టాలీవుడ్ ఇండస్ట్రీలో నెం.1 హీరో ఎవరంటే...?

టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో ఎవరనే చర్చ దశాబ్దాల నుంచి జరుగుతూనే ఉంది.మొదట్లో సీనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో నంబర్ 1 స్థానంలో చాలా సంవత్సరాలు కొనసాగారు.

 Who Is The Number One Hero In Tollywood, Tollywood No.1 Hero, Tollywood, Allu A-TeluguStop.com

అయితే శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో అప్పటినుంచి నంబర్ వన్ హీరో ఎవరనే చర్చ జరుగుతోంది.

ఈ రేసులో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు.

వీరిలో పవన్ కల్యాణ్ అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నాడు.అజ్ఞాతవాసి ఫ్లాప్ తరువాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే పవన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ బాగానే ఉన్నా పూర్తిగా సినిమాలపైనే పవన్ దృష్టి పెట్టకపోవడంతో ఆయనను నంబర్ వన్ రేసులో మినహాయించాల్సి వస్తోంది.
ఇక మహేష్ సినిమా కెరీర్ విషయానికి వస్తే ఆయన సినిమా అయితే బ్లాక్ బస్టర్ లేకపోతే డిజాస్టర్ అవుతోంది.

సక్సెస్ ల విషయంలో కంటిన్యుటీ లేకపోవడం వల్ల మహేష్ నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నా ఆ స్థానం కైవసం చేసుకోలేకపోతున్నారు.ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి, బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్లైనా వాటి ఫలితాలతో ప్రభాస్ కు నంబర్ 1 స్థానాన్ని కట్టబెట్టలేము.

ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే సినిమాకుసినిమాకు ఎన్టీఆర్ రేంజ్ పెంచుకుంటున్నా ఎన్టీఆర్ స్థాయికి తగిన హిట్లు మాత్రం దక్కాల్సి ఉంది.ఇక చరణ్ విషయానికి వస్తే మూస సినిమాలు చేస్తున్నాడన్న బ్యాడ్ ఇమేజ్ ను రంగస్థలం ద్వారా పోగొట్టుకున్న చరణ్ వినయవిధేయరామ డిజాస్టర్ తో అభిమానులను నిరాశపరిచాడు.

ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టినా ఆ హిట్ ను కంటిన్యూ చేస్తూ వరుస హిట్లు సాధిస్తాడో లేదో చూడాలి.ప్రస్తుతం క్రేజ్ పరంగా పవన్, వరుస హిట్ల పరంగా ఎన్టీఆర్, సక్సెస్ రేట్ పరంగా అల్లు అర్జున్, మహేష్ బాబు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా, రామ్ చరణ్ మాస్ ఇమేజ్ పరంగా, ప్రభాస్ ప్యాన్ ఇండియా అప్పీల్ పరంగా కొన్ని విషయాల్లో నంబర్ 1 గా ఉన్నారు.

మరి టాలీవుడ్ నంబర్ వన్ స్థానంలో నిలిచేదెవరో తెలియాలంటే మాత్రం మరికొన్నేళ్లు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube