ఉప్పెన సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

మెగా ఫ్యామిలీ నుండి గ్రాండ్ గా లాంచ్ అయిన మరో హీరో వైష్ణవ్ తేజ్.కరోనా కారణంగా వాయిదా పడుకుంటూ వచ్చిన ఉప్పెన మూవీ థియేటర్స్ ప్రారంభం అయిన మొదట్లోనే నిర్మాతలు ధైర్యం చేసి మూవీని రిలీజ్ చేశారు.

 What Is The Remuneration Of Vaishnav Tej For Uppena, Vaishnv Tej, Uppena Movie,-TeluguStop.com

అయితే మూవీ టీమ్ కు ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉన్నా వారి అంచనాలను మించి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.అయితే ఇప్పుడు విడుదలైన ప్రతి థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ వసూల్ల పర్వాన్ని కొనసాగిస్తోoది.

అయితే ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్ గురించి సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాకు 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.ఇక వైష్ణవ్ డైరెక్టర్ క్రిష్ తో చేయబోయే సినిమాకు 75 లక్షలు తీసుకుంటున్నాడు.

ఇక మూడో సినిమాకు 2 కోట్ల 50 లక్షలు తీసుకుంటున్నాడట.ఏది ఏమైనా మొదటి సినిమా హిట్ కొట్టి వైష్ణవ్ తేజ్ తన సత్తా చాటాడని చెప్పవచ్చు.

ఇంకొక సినిమా బ్లాక్ బాస్టర్ అయితే స్టార్ హీరో తీసుకునే రెమ్యునరేషన్ కు చేరే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube