తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఈవీఎంల సమస్యలు తలెత్తిన ప్రాంతాల్లో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్ రెడ్డి పేర్కొన్నారు.అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలని చెప్పారు.
ఇక నుంచి పోలింగ్ పెరుగుతుందని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయన్న వికాస్ రాజ్ ఈ వివాదాలపై డీఈవోను రిపోర్డ్ అడిగామని తెలిపారు.
అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు.డీఈవో రిపోర్డ్ రాగానే కోడ్ ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.