వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది.మహిళా హాస్టల్ లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.
జూనియర్ల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన యూనివర్సిటీ అధికారులు 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు వేశారు.వారం రోజుల పాటు స్టూడెంట్స్ పై సస్పెన్షన్ కొనసాగనుండగా వీరిలో ఎకనామిక్స్, కామర్స్ మరియు జువాలజీ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది.
అయితే అమ్మాయిలే ర్యాంగింగ్ పాల్పడటం, సుమారు 81 మంది సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది.