ఇంచార్జీ పదవి కోసం మాజీ ఎంపీల  మధ్య వార్ ?  మునుగోడు బీజేపీ లో టెన్షన్ ?

త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,  టిఆర్ఎస్, బీజేపీలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 War Between Former Mps For The Post Of Incharge? Tension In Bjp Earlier Munugodu-TeluguStop.com

ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని అన్ని పార్టీలు భావిస్తుండడంతో, ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.ఇప్పటికే టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జిల నియామకం పూర్తి చేసింది.

మండలాలు గ్రామాల వారీగా మంత్రులు , ఎమ్మెల్యేలకు , పార్టీ కీలక నాయకులకు బాధ్యతలను అప్పగించారు.

     ఇక కాంగ్రెస్ సైతం గడపగడపకు కాంగ్రెస్ పేరుతో నియోజకవర్గంలోని ప్రతి ఓటరుని పలకరించే విధంగా,  ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్ కి ఓటు వేయాలని కోరేందుకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించింది.

ప్రతి గ్రామం లోను ఈ కార్యక్రమం ఎన్నికల వరకు జరిగే విధంగా రూపకల్పన చేశారు.ఇదిలా ఉంటే రాబోయే  ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి మునుగోడులో గెలుపు తమదే అన్న ధీమాలో ఉంది .గతంలో జరిగిన దుబ్బాక హుజురాబాద్ ఎన్నికల ఫలితాలే ఇక్కడ కూడా వస్తాయని నమ్ముతోంది.దీనికి తోడు కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉండడం ఇవన్నీ కలిసి వస్తాయని చూస్తోంది.
     

Telugu Congress, Jothendar Reddy, Telangana, Trs-Politics

  ఇక ఈ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి పదవి విషయంలో బిజెపిలో ముసలం మొదలైంది.ముఖ్యంగా ఈ పదవి తమకు కావాలంటే తమకి కావాలంటూ మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి,  జితేందర్ రెడ్డిలు పోటీపడుతుండడంతో  ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటివరకు ఇన్చార్జిగా ఎవరిని బిజెపి నియమించలేదు.షెడ్యూల్ వెలువడిన తర్వాత ఇన్చార్జిని నియమించాలని చూస్తోంది.అయితే దళిత సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇన్చార్జి పదవి ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లు బిజెపి వైపు పడతాయని బిజెపి అధిష్టానం పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు.దీంతో ఆ పదవి తనకే వస్తుంది అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆశలు పెట్టుకున్నారు.

అయితే గతంలో దుబ్బాక హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నికలలో ఇన్చార్జిగా బాధ్యతలు తానే చూసానని,  ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తానని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య సైలెంట్ గా వార్ జరుగుతోంది.

ఈ ఇద్దరిలో ఎవరికి పదవి ఇచ్చినా మరొకరు అసంతృప్తికి గురయ్య అవకాశం ఉండడం , దాని ప్రభావం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనే టెన్షన్ బిజెపి  నేతల్లో మొదలైంది.మరి ఈ విషయంలో అధిష్టానం పెద్దలు ఎవరు వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube