కర్ణాటక రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.కర్ణాటక రాష్ట్రం పరిధిలో ఉన్న నదీ ప్రవాహ ప్రాంతాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి.
ముఖ్యంగా బెంగళూరు నగరమంతా వరదల్లో మునిగిపోయింది.అక్కడి నివాసాలు వరద నీటితో నిండుకున్నాయి.
భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కూడా ఇక్కడ జరుగుతోంది.ఈ వరదలకు విద్యుత్తు సరఫరా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
ప్రాణ భయంతో పాటు తీవ్ర అసౌకర్యాన్ని వల్ల చాలామంది ఇల్లు ఖాళీ చేసి సురక్షితమైన హోటల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.అయితే ఈ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుంటూ హోటళ్లు రూమ్‌ల ధరలు భారీగా పెంచేస్తున్నాయి.
మామూలు సమయాల్లో ఒక్క నైట్‌కు రూ.10-20 వేల పరిధిలో ఉండే రూమ్‌ల ధరలు ఇప్పుడు ఏకంగా రూ.30 వేలు – రూ.40 వేల వరకు పెరిగిపోయాయి.అవుటర్ రింగ్ రోడ్డు, పాత ఎయిర్ పోర్టు రోడ్డు వంటి చాలా ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునగడంతో సమీపంలోని హోటళ్లలో రూమ్స్ అన్ని బుక్ అయ్యాయి.అయితే మామూలు హోటల్స్‌తో పోల్చుకుంటే ఓయో రూమ్స్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.
దాంతో వీటిలో నివసించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
వీళ్లతో పాటు పొలాలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి.ఇటీవల ఒక రైతు వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారు.ఇక మూగ జంతువుల కుప్పలుతెప్పలుగా శవాలై తేలుతున్నాయి.
పాములు ఇళ్లల్లోకి కొట్టుకు రావడంతో చాలా మంది ప్రాణభయంతో హడలిపోతున్నారు.ఈ కష్టకాలంలో ప్రజలకు పాలక యంత్రాంగాలు వీలైనంత సహాయం అందిస్తున్నారు.