కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు విశాల్ త్వరలోనే మార్క్ ఆంటోనీ( Mark Antony ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అవార్డ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి విశాల్ తాజాగా నిర్మాతలు ( Producers ). గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఈయనకు తన సొంత నిర్మాణ సంస్థ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను ఇతర ప్రొడక్షన్స్ లో సినిమాలు చేసే సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాను.శుక్రవారం సినిమా విడుదల అవుతుంది అంటే గురువారం రాత్రి ప్రొడ్యూసర్లు తనని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేవారు.
ఫైనాన్షియర్ తనపై ప్రెజర్ పెడుతున్నారని సినిమా విడుదల కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ చాలా ఎమోషనల్ గా నన్ను బ్లాక్ మెయిల్( Blackmail ) చేసే వారిని , నాతోనే డబ్బులు కూడా కట్టించేవారు అంటూ విశాల్( Hero Vishal ) తెలిపారు.
ఇలా ఎన్నో రకాల సమస్యలతో తాను నిర్మాతల నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం నావల్ల కాదు అందుకే నిర్మాణ సంస్థ( Hero Vishal Production House)ను స్థాపించాను అంటూ ఈ సందర్భంగా నిర్మాతలు గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.మరి విశాల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై నిర్మాతలు ఎవరైనా స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.