విరాటపర్వం రివ్యూ & రేటింగ్

డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, ఈశ్వరి రావు, జరీనా వాహబ్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబుతో పాటు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

 Virataparvam Movie Review Rating, Virata Parvam, Tollywood, Sai Pallavi, Rana, R-TeluguStop.com

సురేష్ బొబ్బలి సంగీత దర్శకత్వంలో, దివాకర్ మణి, డాని సాంచేజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.

కథ: విరాట పర్వం కథను 1990,92 ఈ ప్రాంతంలో జరిగిన ఒక నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కినది.ఇందులో వెన్నెల (సాయి పల్లవి) ములుగు జిల్లాకు చెందిన ప్రాంతంలో జన్మిస్తుంది.ఈమె జననమే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది.పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో వెన్నెల జన్మిస్తుంది.వెన్నెల తల్లికి (ఈశ్వరీరావు) పురుడు పోసి తన బిడ్డకు వెన్నెల అని పేరు పెట్టేది కూడా ఒక మావోయిస్ట్(నివేదా పేతురాజ్) వెన్నెల పెరిగి పెద్దయిన తర్వాత మావోయిస్టు దళ నాయకుడు అరణ్య అలియాస్ రవన్న (రానా) రాసిన పుస్తకాలను చదువుతూ అతనితో ప్రేమలో పడుతుంది ఇక ఈ విషయం వెన్నెల తల్లిదండ్రులకు(సాయి చంద్, ఈశ్వరి రావు) తెలియక వెన్నెల బావ(రాహుల్ రామకృష్ణ) తో పెళ్లి ఫిక్స్ చేస్తారు.

తనతో పెళ్లి ఇష్టం లేని సాయి పల్లవి తను రవన్నను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పి ఇల్లు వదిలి ఎన్నో అష్టకష్టాలు పడుతూ చివరికి రవన్నను చేరుకుంటుంది.రవన్న కోసం కుటుంబాన్ని వదిలి వెళ్ళిన వెన్నెల ప్రేమను రవన్న అంగీకరిస్తాడా? ఇలా ఈమె మావోయిస్టులు చేరడానికి ఎన్ని కష్టాలు పడింది? రవన్న ప్రేమలో పడిన వెన్నెల మావోయిస్టుగా మారి చివరికి వారి చేతిలో చనిపోవడానికి కారణం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే

Telugu Rana, Review, Sai Pallavi, Tollywood, Virata Parvam-Movie Reviews

నటీనటుల నటన:

ఈ సినిమాలో సాయి పల్లవి రానా పాత్ర ఎంతో అద్భుతమైన చెప్పాలి.ఇక ప్రియమణి పాత్ర కూడా ఎంతో అద్భుతం.నివేద పేతురాజ్, నవీన్ చంద్ర, అద్భుతమైన నటనను కనబరిచారు.

టెక్నికల్:

దర్శకుడు వేణు టేకింగ్ అద్భుతంగా ఉంది.సురేష్ బొబ్బిలి సంగీతం మరింత బలం చేకూర్చింది.

సినిమాకి నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి.సినిమాటోగ్రఫీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది.

Telugu Rana, Review, Sai Pallavi, Tollywood, Virata Parvam-Movie Reviews

విశ్లేషణ:

డైరెక్టర్ వేణు సరికొత్త కథాంశంతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో ముఖ్యంగా సాయి పల్లవి నటన అద్భుతం.సినిమాకి సంగీతం మరింత హైలైట్ అయింది.

ప్లస్ పాయింట్స్:

రానా సాయి పల్లవి పాత్రలలో జీవించారు.ఇక సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయింది.

Telugu Rana, Review, Sai Pallavi, Tollywood, Virata Parvam-Movie Reviews

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించాయి.కొన్ని సీన్స్ పునరావృతం జరిగాయి.

బాటమ్ లైన్: వామపక్ష భావజాలం కలిగిన వారికి ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది.ముఖ్యంగా సాయి పల్లవి నటన కోసం సినిమా చూడొచ్చు.

రేటింగ్ 3/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube