వామ్మో, అక్కడ ఒక్క ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ధర రూ.15,250 అట..!

సాధారణంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నప్పుడు ఒకే రకమైన టేస్ట్ నాలుకకు తగులుతుంది.అయితే ఓ న్యూయార్క్ రెస్టారెంట్‌లో మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే అన్ని రకాల రుచులు తిన్న అద్భుతమైన అనుభూతి లభిస్తుంది.

 Viral Video The World Most Expensive French Fries Found In New York Restaurant D-TeluguStop.com

ఇలాంటి అరుదైన ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రపంచంలో దొరకడం చాలా అరుదట.అయితే దీని ధర కూడా చాలా ఎక్కువే.

ఎందుకంటే దీనిని తినదగిన బంగారు పూతతో తయారు చేస్తారు.

న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లోని ఫాస్ట్ ఫుడ్ అమ్మే సెరెండిపిటీ రెస్టారెంట్ ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను నెలకొల్పింది.

అయితే రీసెంట్ టైంలో ఈ రెస్టారెంట్‌లోని మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయిన ‘క్రీమ్ డెలా క్రీమ్ పోమ్మెస్ ఫ్రైట్స్’ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.ఇది 2021లో ‘అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది.ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ధర అక్షరాల 200 డాలర్లు లేదా దాదాపు రూ.15,250 అట.అయితే తాజాగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఫాస్ట్ గా తిని కెవిన్ థామస్ స్ట్రాల్ అనే ఒక వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.ఫ్రెంచ్ ఫ్రైస్‌ని వేగంగా తిన్నందుకు గాను అతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ప్రధానం చేసినట్లుగా ఒక వీడియో రూపంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది.ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ఏయే పదార్థాలు ఉపయోగించారంటే.అప్‌స్టేట్ చిప్పర్‌బెక్ బంగాళాదుంపలు, వింటేజ్ 2006 డోమ్ పెరిగ్నాన్ షాంపైన్, J.లెబ్లాంక్ ఫ్రెంచ్ షాంపైన్ ఆర్డెన్నే వెనిగర్, ఫ్రాన్స్ నుంచి స్వచ్ఛమైన గూస్ ఫ్యాట్, గురాండే ట్రఫుల్ సాల్ట్, ట్రఫుల్ ఆయిల్, ఇటలీ నుంచి సమ్మర్ ట్రఫుల్స్, ట్రఫుల్ బటర్, ఆర్గానిక్ ఏ2 100% జెర్సీ ఆవుల నుంచి 100% గ్రాస్ ఫెడ్ క్రీమ్, ఏ 23కె ఎడిబుల్ గోల్డ్ డస్ట్ వాడి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ తయారు చేశారు.అందుకే దీనికింత ధర.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube