వైరల్ వీడియో: కరోనాకు వీడ్కోలు చివరకు ఇలానే ఉంటుంది కాబోలు..!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భూతంలా పట్టిపీడిస్తోంది.అయితే భారత్‌ లో మాత్రం పరిస్తితి అందుకు భిన్నంగా ఉంది.

 Viral Video: Farewell To Corona Will Finally Be The Same Kabolu ..! Viral Video-TeluguStop.com

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను ఉతికారేస్తున్నారు.అదేనండీ కరోనా వైరస్ కేసులు ఓ వైపు నమోదువుతుంటే మరోవైపు కరోనా లేదు గిరోనా లేదంటూ ఫన్నీ ట్రోల్స్‌ తో ఆటాడేసుకుంటున్నారు.

కరోనా ఇంత అందంగా ఉంటుందా అని ఒకరు పోస్ట్ చేస్తే, బేబీ నువ్వు చాలా హాట్ నీకు కరోనా సోకే ఛాన్స్ లేదంటూ పులిహోర రాజాలు సైతం కరోనాను విచ్చలవిడిగా ప్యాక్ ఆడేస్తున్నారు.ఇలాంటి సమయంలో ఫన్నీ వీడియోలు తెగ నవ్వు తెప్పిస్తున్నాయి.

అటువంటి ఓ ఫన్నీ వీడియోను ఐపిఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే, ఈ వీడియోను పంచుకునేటప్పుడు, ఆమె ‘కరోనా వీడ్కోలు ఇలా ఉంటుంది.

ఇది కరోనా యొక్క వీడ్కోలు వేడుకల యొక్క దృశ్యం.అని క్యాప్షన్ పెట్టారు.

ఇది కరోనా వీడ్కోలు అని అర్ధం వచ్చేలా పెట్టిన ఈ వీడియోను చూస్తె నవ్వు ఆగదు.సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియో చాలా మంది లైక్ చేస్తున్నారు.

దీనిమీద కామెంట్స్ చేస్తున్నారు.</br.

వీడియోలో ఒక<emతండ్రి కుమార్తెను చెప్పుతో కొట్టేస్తా మళ్ళీ వచ్చావంటే అని చెబుతూ ఊరి పొలిమేరల్లో ఆమె భర్త వెంట పంపేస్తూ ఉంటాడు.వీడియో ప్రారంభంలో ఒక యువతి తన తండ్రిని వదలలేక ఏడుస్తుంది.

తండ్రి మెల్లగా ప్రేమగా తనూ బాధపడుతూనే ఆమెను వెళ్ళమని సాగానంపుతాడు.తరువాత, ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వస్తుంది.

మళ్ళీ తండ్రి సముదాయించి పంపుతాడు.అలా మూడు నాలుగు సార్లు జరుగుతుంది.

ఇక చివరికి సహనం చచ్చిపోయిన తండ్రి ఆమెను మళ్ళీ ఇటు వచ్చావంటే దెబ్బలు పడతాయి అని చెప్పి నెట్టి పంపించేస్తాడు.ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube