వెక్కివెక్కి ఏడ్చిన రాశీఖన్నా.. ఆ సీన్లే కారణమట....

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు అన్ని రకాల పాత్రల్లో నటిస్తే మాత్రమే గుర్తింపును సంపాదించుకుంటారనే సంగతి తెలిసిందే.నటిగా గుర్తింపును సొంతం చేసుకోవడానికి కొంతమంది హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.

 Viral Rashi Khanna Shares Emotional Moment About Madras Cafe Movie Shooting-TeluguStop.com

అయితే స్టార్ హీరోయిన్ రాశీఖన్నాకు మాత్రం బెడ్ రూమ్ సీన్లలో నటించడం అస్సలు నచ్చదట.సినిమాల్లో నటించడం అంత తేలిక కాదని రాశీఖన్నా చెప్పకనే చెప్పేశారు.

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈ హీరోయిన్ మద్రాస్ కేఫ్ అనే సినిమాలో ఒక బెడ్ రూమ్ సన్నివేశంలో నటించాల్సి వచ్చింది.ఆ సీన్ లో నటించడం రాశీఖన్నాకు అస్సలు ఇష్టం లేదు.

 Viral Rashi Khanna Shares Emotional Moment About Madras Cafe Movie Shooting-వెక్కివెక్కి ఏడ్చిన రాశీఖన్నా.. ఆ సీన్లే కారణమట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో వ్యక్తితో బెడ్ పై ఉండాలనే ఆలోచనే రాశీఖన్నాకు అస్సలు నచ్చలేదు.ఆ సీన్ గురించి తల్లికి చెప్పిన రాశీఖన్నా ఆ సన్నివేశంలో నటించాలంటే భయంగా ఉందని పేర్కొన్నారు.

ఆ తరువాత రోజు షూటింగ్ కు హాజరై ఎలాగోలా షూటింగ్ ను పూర్తి చేశారు.అయితే సీన్ షూటింగ్ పూర్తైన వెంటనే రాశీఖన్నా కారవాన్ లోకి వెళ్లి తెగ ఏడ్చేశారట.గతేడాది విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సైతం రాశీఖన్నా కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో కూడా రాశీఖన్నా టెన్షన్ పడగా విజయ్ దేవరకొండ రాశీఖన్నాకు ధైర్యం చెప్పి ఆ సీన్స్ లో నటించడానికి ఒప్పించారని సమాచారం.

ప్రస్తుతం బెడ్ రూమ్ సీన్లలో కానీ, అభ్యంతరకర సీన్లలో కానీ నటించాల్సి వస్తే రాశీఖన్నా పాత్ర నుంచి తనను తాను వేరు చేసుకుని నటిస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ హీరోయిన్ నాగచైతన్యకు జోడీగా థ్యాంక్యూ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు.

గోపీచంద్ హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో సైతం రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

#WorldFamous #RaashiKhanna #Madras Cafe #Raashi Khanna #Thank You Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు