దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు.ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థులు, ప్రచారం చేసే వారికి భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీకి గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే స్వేచ్ఛాయుతమైన, నిస్పక్షపాతమైన ఎన్నికల కోసం శాంతియుత, సురక్షితమైన వాతావరణం అవసరమని ఆమె పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని తెలిపారు.ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమని వెల్లడించారు.