టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విధంగా ఘోరమైన డిజాస్టర్ ను చవి చూసింది.
అయితే సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి.కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఇలా డిజాస్టర్ అవ్వడంతో విజయ్ దేవరకొండ తో పాటు అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు.
ఈ విషయం పట్ల విజయ్ దేవరకొండ ని అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా తీవ్రస్థాయిలో ట్రోలింగ్స్ చేస్తూ మండిపడ్డారు.
కానీ విజయ్ అవేవీ పట్టించుకోకుండా తన తదుపరి సినిమా అయినా ఖుషి సినిమా కోసం కష్టపడుతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే లైగర్ సినిమా తర్వాత సోషల్ మీడియాలో కొద్దిరోజుల పాటు కనిపించని విజయ్ దేవరకొండ మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా తన అభిమానులతో తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని పంచుకున్నాడు విజయ్.
అందుకు సంబంధించిన వీడియో ని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు.
కష్టపడి పని చేయండి.
మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి.
కొత్త నైపుణ్యాల పై దృష్టి పెట్టండి.తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి.విజయాన్ని ఆస్వాదించండి.
మీకు నచ్చినట్టు జీవించండి అని రాసుకొచ్చాడు విజయ్.దీని పై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ.
కష్టపడి పనిచేసేవారికి తప్పకుండా విజయం దక్కుతుంది.అన్నా.
మీరే మా స్ఫూర్తి.నువ్వు తగ్గొద్దు అంటూ విజయ్ పై తమకున్న అభిమానాన్ని చాటుకొంటున్నారు.
అయితే విజయ్ దేవరకొండ షేర్ చేసిన వీడియో పై ఇంకొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.ఆ వీడియోలో లైగర్ సినిమా సమయంలో విజయ్ జిమ్ లో ట్రైనింగ్ కు సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్నారు విజయ్.ఇందులో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.