Venkatesh Srihari : శ్రీహరి తో చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమాలోకి వెంకటేష్ ఎలా వచ్చాడు..?

సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా మంది నటులు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వెంకటేష్( Venkatesh ) లాంటి నటుడు కూడా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు వరుస హిట్స్ ను అందుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీలక పాత్రను పోషిస్తూ వస్తున్నాడు.

 Venkatesh Srihari-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లు అవుతూ వస్తున్నాయి.

ఇక వెంకటేష్ హీరోగా ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జయం మనదేరా సినిమాను( Jayam Manadera ) ఎన్ శంకర్ మొదట శ్రీహరితో చేద్దామని ప్లాన్ చేశాడు.

 Venkatesh Srihari-Venkatesh Srihari : శ్రీహరి తో చేయా-TeluguStop.com

కానీ రామానాయుడు ఎన్ శంకర్ ను పిలిచి ఏదైనా కథ ఉంటే చెప్పు వెంకటేష్ తో సినిమా చేద్దామని అడిగినప్పుడు ఎన్ శంకర్( N Shankar ) జయం మనదేరా సినిమా కథ చెప్పి ప్రస్తుతానికి ఈ స్టోరీని శ్రీహరితో( Srihari ) చేస్తున్నాను.ఇది అయిపోయిన తర్వాత ఇంకొక కథతో వెంకటేష్ సినిమా చేద్దామని చెప్పాడట.

Telugu Bhadrachalam, Nshankar, Jayam Manadera, Ramanaidu, Srihari, Tollywood, Ve

కానీ రామానాయుడు( Ramanaidu ) మాత్రం ఇదే కథ ని వెంకటేష్ తో చేయి శ్రీహరి తో తర్వాత ఇంకా వేరే సినిమా ఏదైనా చేయమని చెప్పాడట.దాంతో ఎన్ శంకర్ కూడా శ్రీహరిని కన్విన్స్ చేసి జయం మనదేరా సినిమాను వెంకటేష్ తో చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఎన్ శంకర్ మాట ఇచ్చినట్టుగానే ఆ తర్వాత శ్రీహరితో భద్రాచలం( Bhadrachalam Movie ) అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని శ్రీహరికి అందించాడు.

Telugu Bhadrachalam, Nshankar, Jayam Manadera, Ramanaidu, Srihari, Tollywood, Ve

జయం మనదేరా సినిమాలో శ్రీహరి అయితే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయ్యి ఉండేది కాదు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఎందుకంటే వెంకటేష్ కి ఉన్న మార్కెట్ శ్రీహరి కి ఉన్న మార్కెట్ లో చాలా తేడా ఉంది.కాబట్టి దానికి వెంకటేష్ అయితేనే ఈ సినిమాకి పక్కాగా సెట్ అవుతాడని ఇప్పటికి చెబుతూ ఉంటారు.

ఈ సినిమా కోసం ఎన్ శంకర్ వెంకటేష్ను ఎంచుకొని మంచి పని చేశాడు అంటూ ఆయన్ని అందరూ అభినందిస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube