మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.భారత వైమానిక దళం నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ముఖ్యంగా హీరో వరుణ్ తేజ్( Mega Hero Varun Tej ) వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ వ్యక్తిగత విషయాలకు గురించి ఈ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి స్పందిస్తున్నారు.
ఈ మేరకు సాయి పల్లవి( Sai Pallavi ) తో కలిసి నటించడం గురించి, వారిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మరో సినిమా గురించి స్పందించారు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.సాయిపల్లవితో మరోసినిమా చేయాలని ఉంది.కచ్చితంగా చేస్తాము.సాయిపల్లవి కూడా తన ఆఫీస్ కు వచ్చే కథలను చెబుతూ ఉంటోంది.కానీ మేం చేయబోయే కథ ఫిదా కంటే కాస్తా ఎక్కువగా ఉండాలని చూస్తున్నాము.
అందుకే కాస్తా ఆలస్యం అవుతోంది.మంచి లవ్ స్టోరీ( Love Story ) వస్తే మాత్రం కాంబినేషన్ రిపీట్ అవ్వుద్ది.
నాకూ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ సినిమాలు చేయాలనుంది.
నెక్ట్స్ వాటిపైనే ఫోకస్ పెడుతున్నాను అని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే ఇప్పటికే వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్ లో ఫిదా మూవీ( Fidaa ) విడుదల అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో వరుణ్ తేజ్ సాయి పల్లవి క్రేజ్ మరింత పెరిగింది.మరి త్వరలోనే రాబోతున్న ఆ సినిమా కోసం సాయి పల్లవి వరుణ్ తేజ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.