Varalaxmi Sarathkumar : వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి బ్యాగ్రౌండ్ ఇదే.. ఎన్నేళ్ల ప్రేమ అంటే?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఇదే రంగానికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించేవారు.అయితే ఇప్పుడు మాత్రం సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఇతర రంగాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

 Varalaxmi Sharat Kumar Husband Background Details Here Goes Viral In Social Med-TeluguStop.com

ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్( Varalaxmi Sarathkumar ) ఈ నెల 1వ తేదీన నిశ్చితార్థం జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.గ్యాలరిస్ట్ నికోలాయి సచ్ దేవ్( Gallerist Nicholai Sachdev ) తో ఆమె నిశ్చితార్థం జరిగింది.

గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలతో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి.అయితే ఆ వార్తలను ఆమె మాత్రం ఖండిస్తూ వచ్చారు.

Telugu Vishal, Tollywood-Movie

విశాల్( Hero Vishal ) తో వరలక్ష్మి ప్రేమలో ఉందని అయితే తండ్రికి ఇష్టం లేకపోవడం వల్ల విశాల్ విషయంలో ఆమె నిర్ణయం మారిందని కామెంట్లు వినిపించడం గమనార్హం.వరలక్ష్మి ప్రస్తుతం తెలుగు సినిమాలలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముంబైలోని ప్రముఖ బిజినెస్ మేన్ లలో ఒకరు కాగా ఆయన ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తూ ఉంటారని తెలుస్తోంది.14 ఏళ్ల నుంచి వరలక్ష్మి నికోలాయ్ మధ్య పరిచయం ఉందని ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని తెలుస్తోంది. నిశ్చితార్థం( Varalaxmi Sarath kkumar ) రహస్యంగా జరుపుకున్నా పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిగేలా వరలక్ష్మి కుటుంబ సభ్యుల ప్లాన్స్ ఉన్నాయని భోగట్టా.

Telugu Vishal, Tollywood-Movie

ముంబైలో నిశ్చితార్థ వేడుక జరగగా ఈ ఏడాది సెకండాఫ్ లో పెళ్లి జరగనుందని తెలుస్తోంది.హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని వరలక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యారు.ఆమె వాయిస్ ఆమెకు బలమని చాలామంది భావిస్తారు.

మరి కొందరు టాలీవుడ్ హీరోయిన్లు( Tollywood Heroines ) సైతం ఈ ఏడాది పెళ్లికి సంబంధించిన శుభవార్తలు చెప్పనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube