Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతో బాధపెట్టిన మూడు సినిమాలు ఇవే.. అలాంటి విమర్శలు రావడంతో?

సినిమా హీరోలు ప్రతి సినిమాకు దాదాపుగా ఒకే స్థాయిలో కష్టపడతారు.హిట్టైన సినిమాలు హీరోలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తే ఫ్లాప్ సినిమాలు ఊహించని స్థాయిలో బాధ పెడతాయి.

 Three Flop Movies Deeply Hurted Young Tiger Junior Ntr Details Here Goes Viral-TeluguStop.com

ఒక సినిమా ఫ్లాప్ రిజల్ట్( Movie Flop ) ను అందుకుంటే ఆ సినిమాకు పని చేసిన ఎంతోమందిపై ఆ ప్రభావం పడుతుంది.అలా జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో మూడు సినిమాల ఫలితాలు ఆయనను ఎంతగానో బాధ పెట్టడం గమనార్హం.

సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో పాటు ఊహించని స్థాయిలో విమర్శలు రావడంతో ఆ సినిమాల రిజల్ట్ విషయంలో తారక్( NTR ) ఎంతో ఫీలయ్యారని తెలుస్తోంది.

Telugu Flop, Ntr, Rabhasa, Shakti, Simhadri, Flopdeeply-Movie

జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ను ఎంతో బాధ పెట్టిన సినిమాలలో ఆంధ్రావాలా సినిమా( Andhrawala ) ఒకటి.ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కాగా ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ కు అప్పట్లో 10 లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారు.

Telugu Flop, Ntr, Rabhasa, Shakti, Simhadri, Flopdeeply-Movie

సింహాద్రి( Simhadri ) తర్వాత తారక్ నటించిన సినిమా కావడంతో ఆంధ్రావాలా సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలైంది.అయితే సెకండాఫ్ లో కథనం విషయంలో చేసిన కొన్ని తప్పులు, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో కనిపించిన లుక్ ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.2004 జనవరి 1న విడుదలైన ఈ సినిమా నిర్మాతకు పెద్దగా నష్టాలు తెచ్చిపెట్టకపోయినా ఎన్టీఆర్ ను, ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపెట్టింది.

Telugu Flop, Ntr, Rabhasa, Shakti, Simhadri, Flopdeeply-Movie

ఆంధ్రావాలా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను బాధ పెట్టిన సినిమా ఏదనే ప్రశ్నకు శక్తి సినిమా( Shakti ) పేరు జవాబుగా వినిపిస్తుంది.అప్పట్లో 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బడ్జెట్ లో సగం కలెక్షన్లు కూడా రాలేదు.ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్రెస్సింగ్ విషయంలో, ఒక పాత్రకు సంబంధించి తారక్ హెయిర్ స్టైల్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.

ఎన్టీఆర్ తో మిషన్ ఇంపాజిబుల్ తరహా సినిమా తీయాలని అనుకున్న మెహర్ రమేష్ శక్తి సినిమా తీశాడు.జూనియర్ ఎన్టీఆర్ నమ్మి ఛాన్స్ ఇస్తే ఆ నమ్మకాన్ని మెహర్ రమేష్ వమ్ము చేశాడు.

Telugu Flop, Ntr, Rabhasa, Shakti, Simhadri, Flopdeeply-Movie

తారక్ ను ఎంతో బాధ పెట్టిన మరో సినిమా ఏదనే ప్రశ్నకు రభస సినిమా( Rabhasa ) పేరు జవాబుగా వినిపిస్తుంది.ఏ మాత్రం ఆసక్తికరంగా లేని ఈ సినిమా కథకు ఎన్టీఆర్ ఎలా ఓకే చెప్పాడని అప్పట్లో కామెంట్లు వినిపించాయి.సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా కూడా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.ఈ సినిమాలు ఎంతో బాధ పెట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube