తన తొలి విడత వారాహి యాత్ర ( Varahi yatra ) ద్వారా ఎన్నికల వాతావరణాన్ని ఒక్క సారికగా సృష్టించి ఎన్నికల వేడిని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిన పవన్ వారాహి రెండో దశయాత్రకు శ్రీకారం చుట్టారు.తొలి విడత పర్యటనలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలతో పాటు ప్రజలలో ఆలోచనలు రేకెత్తించే విధంగా ఆయన చేసిన యాత్ర సూపర్ సక్సెస్ అయింది.
ఒకవైపు దూకుడైన విమర్శలు చేస్తూ మరోవైపు తమకు అవకాశం ఇస్తే చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ అనేక సామాజిక వర్గాలను విడతల వారీగా కలుస్తూ ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్లిన జనసేన( Jana Sena ) యాత్ర జనసేన రాజకీయ భవిష్యత్తుపై డాని అభిమానులకు కొత్త ఆశలు రేకెత్తించింది.
ఇక వారాహి మలి విడత యాత్ర కూడా గోదావరి జిల్లాల ( East Godavari )చుట్టూనే తిరగనుందని తెలుస్తుంది.ఈ దిశగా పార్టీ ఇప్పటికే మలి విడత షెడ్యూల్ ను ప్రకటించింది .ఏలూరు( Eluru )లో మొదటి సభతో ప్రారంభమయ్యే ఈ యాత్ర 15 రోజులు పాటు కొనసాగుతుందని తెలుస్తుంది.వైసిపి రహిత గోదావరి జిల్లాల స్లోగన్ అందుకున్న పవన్ కళ్యాణ్ దాని నిజం చేసే దిశగా తాను చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అంతేకాకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తులో గోదావరి జిల్లాలోని మెజారిటీ సీట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అందిపుచ్చుకోవాలన్న గట్టి పట్టుదలతో జనసేనా ని ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది .రాష్ట్రంలో మిగతా స్థానాలలో తెలుగుదేశానికి అప్పర్ హ్యాండ్ ఇచ్చి గోదావరి జిల్లాలలో మాత్రం తానే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండాలన్న బలమైన ఆకాంక్షను జనసేనా ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.పొత్తు చర్చలు మొదలయ్యే ముందే గోదావరి జిల్లాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలన్న దృఢ సంకల్పంతో వారాహి యాత్రను ముందుకు తీసుకుకెళ్తున్నట్టుగా విశ్లేషణలు వస్తున్నాయి .
మరి తాను అనుకున్నట్లుగా గోదావరి జిల్లాలపై జనసేన తన పట్టు నిలుపుకుంటుందో లేదో మల్లి విడత యాత్ర పూర్తి అయ్యే సమయానికి ఒక అంచనాకు రావచ్చు.నిలకడైన రాజకీయం చేయలేకపోతున్నారన్న విమర్శలను ఈసారి జనసేనా ని సరైన సమాధానం చెప్పబోతున్నారని ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ తమ పార్టీ అభ్యర్థులను అసెంబ్లీకి తీసుకు వెళ్ళటమే తుది లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారని జన సైనికులు అంటున్నారు.