గన్ కల్చర్ కి చెక్ పెట్టడానికి బిడెన్ సిద్దమే...మరి అడ్డు పడేది ఎవరు...??

అగ్ర రాజ్యం అమెరికాలో గన్ కల్చర్ కి ఏటా వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.అమెరికాలో ఏదో ఒక మూల తుపాకి చప్పుళ్ళు రోజూ వినిపిస్తూనే ఉంటాయి, అమాయకపు ప్రజలు ఎవరో ఒకరు బలై పోతూ ఉంటారు.

 Us President Joe Biden Explained Gun Culture In America,america, Texas Shooting,-TeluguStop.com

అయినా సరే అక్కడి చట్టాలు, కానీ చట్ట సభలలో ఉన్న వారు కానీ తుపాకి నియంత్రణ చట్టాలని ఇప్పటి వరకూ అమలు చేయలేని పరిస్థితి నెలకొంది.రెండు రోజు క్రితం అభంసుభం తెలియని చిన్నారు 20 మంది ఓ ఉన్మాది స్కూల్ లోకి వచ్చిన విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఈ ఘటనపై యావత్ ప్రపంచం దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.ఈ మారణహోమంపై స్పందించిన బిడెన్ వారికి సంతాపం తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

అంతేకాదు గన్ కల్చర్ నుంచీ అమెరికాకు విముక్తి కలగాలని అందుకు చట్టసభ్యులు అందరూ ఒకే తాటిపై ఉండాలని కోరారు.గన్ లాబియింగ్ పై ఉక్కుపాదం మోపాలని కోరారు.

ఎంతో మంది పిల్లలు చనిపోవడం తనను కలిచి వేసిందని గన్ కల్చర్ పై ఓ ప్రణాళిక అవసరమని ప్రకటించారు.దేశాధ్యక్షుడు గన్ కల్చర్ ను నియంత్రిద్దామని ప్రకటించారు సరే మరి గన్ కల్చర్ కు మోకాలు అడ్డేది ఎవరు…

Telugu America, Americans, Gun Violence, Republicans, Texas, Trump, Oe Biden-Tel

తుపాకుల నియంత్రణను మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది రిపబ్లికన్స్.ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో తుపాకి నియంత్రణ గురించి మాట్లాడినా సరే పెద్దగా స్పందించే వారు కాదు, సదరు పార్టీకి వ్యక్తి స్వేచ్చ అంటే తుపాకి స్వేచ్చ అనే భావన ఉండటమే అందుకు ప్రధాన కారణం.అందుకే 18 ఏళ్ళు నిండిన వాడు విద్యార్ది అయినా మరేవడైనా సరే తుపాకి చేత బట్టుకుని యదేశ్చగా అమెరికాలో తిరిగేయచ్చు.

అయితే ఈ తరహా ఆలోచనను రిపబ్లికన్స్ ప్రజలలో బలంగా నాటడం వలన అమెరికన్స్ లో మెజారిటీ ప్రజలు సైతం తుపాకి వాడటం తమ హక్కు స్వేచ్చగానే భావిస్తున్నారు.ఇదిలాఉంటే తాజాగా 13 రాష్ట్రాలు తుపాకుల నియంత్రణపై కటినమైన నిభంధనలతో కూడిన పరిమితులను విధించుకున్నాయి.

మిగిలిన రాష్ట్రాలు ఏవీ కూడా నియంత్రణ ఊసేలేదు ఎందుకంటె ఈ రాష్ట్రాలు అన్నీ రిపబ్లికన్ పార్టీ కి చెందినవి కావడం గమనార్హం.అయితే రాజకీయ పార్టీలు ఒకే ఏకాభిప్రాయానికి వస్తే తప్ప అమెరికాలో గన్ కల్చర్ కు అడ్డు కట్ట వేయలేమని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube