Upasana : ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఇలా చేయండి.. మేము అదే చేశాం.. ఉపాసన కామెంట్స్ వైరల్!

మెగా కోడలు ఉపాసన( Upasana ) ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఎన్నో విషయాలను వెల్లడిస్తూ ప్రజలలో అవగాహన కలిగేలా చేస్తారు.ఒకసారి తల్లైన తర్వాత మునుపటిలా పని చేయడం కత్తి మీద సాము అని ఎంత ప్రయత్నించినా పని చేయడం కష్టమవుతుందని చాలామంది మాట్లాడుతూ ఉంటారని ఉపాసన కామెంట్లు చేశారు.

 Upasana Ram Charan Comments About Pregnancy Details Here Goes Viral In Social M-TeluguStop.com

మొదట ఈ ఆలోచనా ధోరణి మారాలని ఆమె చెప్పుకొచ్చారు.అదే విధంగా కంపెనీలలో సైతం మహిళలకు అనుకూలంగా కొన్ని మార్పులు చేయాలని ఆమె తెలిపారు.

Telugu Game Changer, Pregnancy, Ram Charan, Tolllywood, Upasana-Movie

మహిళలు వారి అవసరాలకు అనుగుణంగా మెటర్నిటీ లీవ్స్ తీసుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఉపాసన చెప్పుకొచ్చారు.ఇప్పటికే దీని గురించి కొన్ని కంపెనీలతో మాట్లాడటం జరిగిందని ఆమె తెలిపారు.ఆడవాళ్లు వారి ఎగ్స్ ను కాపాడుకోవాలని ఉపాసన అన్నారు.వాటిని ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఉపాసన సూచనలు చేశారు.లైఫ్ లో సెటిల్ అయ్యి ఆ తర్వాతే పిల్లల కోసం ప్రయత్నించాలని అనుకునే వారు ఎగ్స్ దాచుకోవాలని ఆమె తెలిపారు.

Telugu Game Changer, Pregnancy, Ram Charan, Tolllywood, Upasana-Movie

ఆర్థిక పరిస్థితి బాగుండి పిల్లల్ని కనాలని అనుకున్న సమయంలో ఆ ఎగ్స్ ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.ఈ విధానం మహిళలతో పాటు దేశ పురోగతికి సైతం ఎంతో ఉపయోగపడుతుందని ఉపాసన వెల్లడించారు.నేను కూడా నా ఎగ్స్ ను దాచుకున్నానని సరైన సమయం అనుకున్నప్పుడే పిల్లలని కన్నామని ఆమె పేర్కొన్నారు.

ఉపాసన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.ఉపాసన కామెంట్లు ఒకింత బోల్డ్ గా ఉన్నా ఈ జనరేషన్ వాళ్లు ఆ కామెంట్లలో పరమార్థాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది.

ఉపాసన రామ్ చరణ్ కెరీర్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.తమ కష్టంతో ఉపాసన, చరణ్( Upasana , Rama charan ) ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.

చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer ) నుంచి ఈ నెల 27వ తేదీన అప్ డేట్ వస్తుందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube