సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు.జుట్టు రాలడం, చిట్లడం, జుట్టు ఎదుగుదల లేకపోవడం, చుండ్రు, కురులు తరచూ డ్రై అవ్వడం వంటివి ప్రధానంగా వేధిస్తుంటాయి.
ఈ క్రమంలోనే వాటి నుంచి బయటపడడం కోసం తోచిన చిట్కాలు అన్నీ ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ సీరం మీకు ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ సీరం ను వారానికి కేవలం ఒక్కసారి వాడారంటే జుట్టు సమస్యలన్నీ పరార్ అవుతాయి.
మరి ఇంతకీ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న టీ కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఒక స్పూన్ కలోంజి సీడ్స్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మందారం పొడి, వన్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి( Amla Powder ) వేసి బాగా మిక్స్ చేసి చిన్న మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
చివరిగా వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన సీరం సిద్ధమవుతుంది.
నైట్ నిద్రించడానికి ముందు తయారు చేసుకున్న సీరంను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మంచిగా మసాజ్ చేసుకోవాలి.ఆపై షవర్ క్యాప్ ధరించి పడుకోవాలి.
మరుసటి రోజు మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సీరంను వాడారంటే మీ జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.
హెయిర్ ఫాల్( Hair fall ) సమస్య దూరం అవుతుంది.జుట్టు పెరగడం చిట్లడం వంటివి తగ్గుతాయి.
చుండ్రు పూర్తిగా మాయం అవుతుంది.పల్చటి జుట్టు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.
మరియు ఈ సీరం మీ కురులను ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.డ్రై అవ్వకుండా రక్షిస్తాయి.
సిల్క్ గా మెరిపిస్తాయి.







