ఉపాసన కొణిదెల.సినిమాల్లో లేకపోయినా హీరోయిన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఈమెకు.
మెగా కోడలు అయిన ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ కు హెల్త్ పై అవగాహన కల్పిస్తుంటుంది.వెయిట్ లాస్ గురించి.
ఆరోగ్యం గురించి తన ఫాలోవర్స్ కు ఎన్నో మెలుకువలు నేర్పుతుంటుంది ఉపాసన.
మెగా కోడలు అయిన ఉపాసన కొణిదెల.
అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంతకు మంచి స్నేహం ఉంది.ఇద్దరు కలిసి అప్పుడప్పుడు సోషల్ మీడియాను వారి ఫొటోలతో ఓ ఊపు ఊపేస్తుంటారు.
ఇక ఇటీవల ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో చేసిన రచ్చ ఇంత అంత కాదు.అయితే ఇప్పుడు ఉపాసన సమంత గురించి ఓ విషయాన్నీ ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
అక్కినేని సమంతకు సంబంధించిన ఒక ఆర్టికల్ ఆమె చదివినట్టు అది చదివి ఆమె చాలా గిల్టీగా ఫీల్ అయినట్టు అందులో పేర్కొంది.ఈ విషయాన్నీ ట్విట్టర్ లో షేర్ చేసిన ఉపాసన.
యువర్స్ న్యూట్రిషన్ గురించి సమంత రాసిన ఆర్టికల్ చదువుతుంటే ఆమెకు చాలా గిల్టీగా అనిపించిందని.ఆరోగ్యంగా జీవించడం అనేది రాత్రికి రాత్రి జరిగే విషయం కాదు కాబట్టి ఆమెకు ఆమె సర్ది చెప్పుకున్నట్టు అందులో చెప్పింది.
అంతేకాదు. ప్లాంట్ బేస్డ్ డైట్‌కి సంబంధించి సమంత తీసుకున్న అప్రోచ్ ఆమెను స్ఫూర్తి చెందేలా చేసింది అని ఏదో ఒకరోజు పూర్తిగా ఆమెలా ఆరోగ్యంగా తయారవుతానంటూ ఆమె చెప్పుకొచ్చింది.ఈ ట్విట్ చూసిన నెటిజన్లు.వావ్.
ఇద్దరు చాలా స్పోర్టివ్ గా ఉన్నారు.ఎంతో హెల్తీ రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.