ప్రేమ్ రక్షిత్. డ్యాన్స్ మాస్టర్ 80 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేయించిన రక్షిత్ మాస్టర్ మొన్న గ్లోబల్ అవార్డు విన్నర్ గా నిలిచినా నాటు నాటు సాంగ్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ చేత స్టెప్స్ వేయించాడు.
ఇక నాటు నాటు పాటకు ప్రపంచ స్థాయిలో ఒక అవార్డు వచ్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి తగిన గుర్తింపు రాక పోవడం పై అందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ రోజు ఈ స్థాయికి రావడానికి మాత్రం చాలా కష్టాలు అనుభవించాడు.
అతడి వెనక ఒక దీన మైన గాద మాత్రమే కాదు ఒక ట్రాజెడీ స్టోరీ కూడా ఉంది.ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తండ్రి ఒక వజ్రాల వ్యాపారి.
కొన్ని సమస్యల కారణంగా కుటుంబం తో విడిగా ఉండేవాడు.ఒంటరిగా ఉన్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి ఆర్థిక కష్టాలు పెరిగాయి.
ఒక వైపు డ్యాన్స్ మాస్టర్ గా అవకాశాలు రావడం లేదు.మరో వైపు బ్రతకడానికి మార్గం లేని పరిస్థితి.1993 లో పూట గడవడం కోసం ఒక టైలర్ షాప్ కూడా పెట్టుకున్నాడు.

తన తండ్రి కూడా డ్యాన్స్ అసిస్టెంట్ గా మారడం తో మరింత ఆర్థికంగా అతడి కుటుంబం చితికి పోయింది.తన చుట్టూ ఉన్న సమస్యలను తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకొని చనిపోవాలనుకున్నాడు.సరిగ్గా అదే సమయంలో తండ్రి దగ్గరి నుంచి వచ్చిన ఫోన్ కాల్ అతడిని బ్రతికించి ఇంత వాణ్ణి చేసింది.
అది మరెవరి సినిమానో కాదు రాజమౌళి తీసిన ఛత్రపతి సినిమా.ఈ సినిమా లో ఒక్క పాట కాదు అన్ని పాటలకు డ్యాన్స్ మాస్టర్ గా అవకాశం వచ్చేలా తండ్రి చేయడం తో అక్కడ మొదలైన ప్రయాణం నేడు ప్రపంచ స్థాయికి చేరింది.

రాజమౌళి సాధారణంగా ఒక టెక్నీషియన్ ని మార్చడు.తన మొదటి సినిమా నుంచి నేటి వరకు దాదాపు 90 శాతం మంది ఆయనతోనే కొనసాగుతున్నారు.వారితో పాటు ఛత్రపతి సినిమా నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొనసాగుతున్నారు.అయన తీసిన మగధీర, మర్యాద రామన్న, బాహుబలి రెండు సినిమాలు, విక్రమార్కుడు వంటి అన్ని సినిమాలకు ప్రేమ్ రక్షిత్ పని చేసాడు.