స్తంభాద్రి ఉత్సవ కమిటీ వారికి చెక్కును అందజేసిన పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గణేష్ నవరాత్రుల సందర్బంగా ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఖమ్మం నగరంలో స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, నిర్వహించుకుంటున్న సందర్భంగా మండప విద్యుత్ వినియోగ చార్జీలను అదేవిధంగా మైక్ పర్మిషన్ కు అయ్యే నగదును పువ్వాడ ఫౌండేషన్ భరిస్తుంది అని, ఆయా నగదు చెక్కును స్తంభాద్రి ఉత్సవ సమితికి అందజేసిన పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న శ్రీ గణేష్ ఉత్సవ మండప విద్యుత్ విద్యుత్ చార్జీల నగదు చెక్కును వారికి అందజేశారు.పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది ఆయా మండపాలకు అయ్యే విద్యుత్, పోలీస్ పర్మిషన్ ఖర్చులు పువ్వాడ ఫౌండేషన్ చెల్లిస్తున్న విషయం విధితమే.
గణేష్ ఉత్సవ మండప నిర్వాహకులకు బాసటగా నిలుస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని స్తంభాద్రి ఉత్సవ కమిటీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు ముందుంటారని ఆ వినాయకుడు మంత్రి పువ్వాడ గారికి ఆయురారోగ్యాలు అందించాలని తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని గణేశుడు ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించారు.