సర్కారు వారి పాట' డైరెక్టర్ పరుశురాం గురించి ఈ విషయాలు తెలుసా?

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో మన ముందుకు వచ్చేశాడు డైరెక్టర్ పరుశురాం.అయితే ఇతను టాలీవుడ్ లో ఒక మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఎదగడానికి ఎంతగానో కష్టపడ్డాడు… ఈ రోజు ఆయన గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.పరుశురాం విశాఖపట్నం జిల్లాలో చేర్లోపాలెం లో జన్మించాడు.వీరిది మధ్యతరగతి కుటుంబం.ఇతనిని అందరూ ముద్దుగా బుజ్జి అని పిలుచుకున్నారు.చిన్నప్పటి నుండి పరుశురాంకు సినిమాలు అంతే మహా పిచ్చి… ఆ పిచ్చి మెల్ల మెల్లగా తనలో సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలన్న కోరికను పెంచింది.

అందుకే తాను ఎంబీఏ స్టూడెంట్ అయినప్పటికీ కూడా సినిమా మీద ఉన్న మక్కువతో తన బంధువు మరియు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ను కలిసి తన కోరికను వెలిబుచ్చాడు.

అయితే పూరి జగన్నాథ్ ఎందుకో తెలియదు కానీ… సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అందుకు ఒప్పుకోలేదు.

అయినా పరుశురాం తన ఆలోచనను విరమించుకోలేదు.అలా పూరి జగన్నాథ్ ను ఒప్పించి తన దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు.

పూరి డైరెక్ట్ చేసిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఆంధ్రావాలా మరియు 143 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.అలా వచ్చిన అనుభవంతో అల్లు అర్జున్ భాస్కర్ కాంబోలో వచ్చిన పరుగు సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు.

మొదటి సినిమా ఛాన్స్ కోసం కథను రెఢీ చేసుకుని ఎంత తిరిగినా… ఎన్ని ఆఫీస్ లకు వెళ్ళినా ఉపయోగం లేదట.

Telugu Anjanayulu, Nikhil, Parasuram, Parugu, Puri Jagannadh, Ravi Teja, Sarkaru

అయితే ఎలాగోలా 2008 లో తన స్వీయ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మరియు అక్ష లతో యువత అనే సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది.పరుశురాం కు ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది.

అలా తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే ఆ తర్వాత 2009 లో మాస్ రాజా రవితేజతో ఆంజనేయులు అనే రివెంజ్ డ్రామాను తీశాడు పరుశురాం.

కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.ఈ సినిమా పరాజయంతో డైరెక్టర్ పరుశురాం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.

కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడ్డాడు.ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఖాళీ గా ఉండి మంచి సబ్జెక్ట్ ను రెఢీ చేసుకుని నారా రోహిత్ తో సోలో సినిమాను తీశారు.

ఈ సినిమా అన్నీ విధాలుగా హిట్ ను సాధించి పరుశురాం ను మళ్లీ ఒక మెట్టు ఎక్కించింది.మళ్లీ టాలీవుడ్ లో పరుశురాం నిలదొక్కుకున్నాడు.

అయితే మళ్లీ రవితేజ తోనే సారొచ్చారు సినిమా తీసి ప్లాప్ ను ఎదుర్కొన్నాడు.ఇక ఈ సినిమాతో రవితేజ తో సినిమా చేయకూడదని డిసైడ్ అయిపోయాడు.

Telugu Anjanayulu, Nikhil, Parasuram, Parugu, Puri Jagannadh, Ravi Teja, Sarkaru

ఈ పరాజయం తో కొంత ఇబ్బంది పడ్డా ఈ సారి ఖచ్చితంగా ఇండస్ట్రీకి మంచి బ్లాక్ బస్టర్ ను ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో మళ్లీ మంచి కథను రెఢీ చేసుకున్నాడు.ఆ విధంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో గీత గోవిందం అనే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో వచ్చి తన సత్తా ఏమిటో తనను విమర్శించిన వారికి చూపించి సక్సెస్ అయ్యాడు.ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది.దీనితో పరుశురాం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు.తాను మొదటి పరాజయం తర్వాత ఎంత బాధలను అయితే అనుభవించాడో… అలా మళ్లీ కాకూడదని… ఎన్ని ఆఫర్లు వచ్చినా తానే ఒక మంచి కథను రాసుకుని మహేష్ ను కలిసి కథ చెప్పిన 10 నిముషాల్లోనే ఓకె చేసేలా వివరించాడు.అలా అప్పుడే సర్కారు వారి పాట సినిమా సక్సెస్ అయింది.

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయ్యి మంచి పాజిటివ్ రీవ్యూలను అందుకుంటోంది.పరుశురాం పడిన కష్టాలు అన్నీ కూడా ఈ ఒక్క విజయంతో చెదిరిపోయాయి అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube