యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా ఆస్తిపాస్తుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) కన్నుమూశారు.ఈ వార్తను UAE వార్తా సంస్థ WAM వెల్లడించింది.2019 సంవత్సరంలో షేక్ నాల్గవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.షేక్ ఖలీఫా మృతి కారణంగా యూఏఈలో 40 రోజుల సంతాప దినాలు ప్రకటించారు.

 Uae President Sheikh Khalifa Networth Details, Uae President, Uae President Died-TeluguStop.com

UAE రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు, వైస్ ప్రెసిడెంట్, ప్రీమియర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్-అల్-మఖ్తూమ్.అల్ నహ్యాన్ బాధ్యతను స్వీకరిస్తారు.షేక్ ఖలీఫా UAEలో సమూలమైన మార్పుకు, దేశాన్ని సంపన్నంగా మార్చడంలో గుర్తింపు పొందారు.2004లో షేక్ ఖలీఫా తన తండ్రి మరణం తర్వాత UAE సింహాసనాన్ని అధిష్టించారు.

అతను UAE రెండవ అధ్యక్షుడు.షేక్ ఖలీఫా నికర ఆస్తుల విలువ గురించి చెప్పుకోవాల్సివస్తే.అతను ప్రపంచంలోని అత్యంత సంపన్న చక్రవర్తులలో ఒకరు.అతని ఆస్తుల నికర విలువ $875 బిలియన్ల కంటే అధికం.

అతని ఆస్తులు ప్రపంచమంతటా ఉన్నాయని తెలుస్తోంది.షేక్ పేరు మీద కొనుగోలు చేసినవి వాటిలో చాలా ఉన్నాయి.

అయితే షేక్ ఆ ఆస్తులను చూడకపోవడం విశేషం.షేక్ ఖలీఫా సంపద గురించి గొప్పగా చెబుతారు.

అతను లండన్‌లోని అత్యంత ధనిక భూస్వాములలో ఒకరిగా గుర్తింపు పొందారు.

Telugu London, Residential, Sheikh Khalifa, Sheikhkhalifa, Uae, Arab Emirates-La

లండన్‌లో పలు భవనాలు షేక్ పేరుతో ఉన్నాయి.2020లో ప్రచురితమైన ది గార్డియన్ నివేదిక ప్రకారం, లండన్‌లో 5.5 బిలియన్ పౌండ్ల రియల్ ఎస్టేట్ రహస్య ఒప్పందం జరిగింది.అందులో షేక్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీల పత్రాలు బయటపడ్డాయి.లండన్‌లోని ఆయన ఆస్తుల గురించి మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం అక్కడ అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో షేక్‌కు ఆస్తులు ఉన్నాయి.

వీటిలో సూపర్ ప్రైమ్ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube