ఒక్కోసారి కొంత మంది సెలబ్రిటీలు చెప్పే మాటలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తాయి.అయితే తిక్క మాటలు మాట్లాడి, తిక్కపోస్టులు పెట్టి తిట్లు తింటే ఫర్వాలేదు.
కానీ కొంత మంది డీసెంట్ గా బిహేవ్ చేసే వారు చెప్పే మాటలు కూడా ట్రోలింగ్ కు గురవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.తాజాగా అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్, రాంచరణ్ సతీమణి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.
వాస్తవానికి తను చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతుంది.తను సోషల్ మీడియాలో చేసే కామెంట్లు కూడా పెద్దగా వివాదాలకు దారి తీయవు.
కొద్ది రోజుల క్రితం టెంపుల్ ఆకారంలో ఉన్న ఫోటో మీద సినిమా తారల ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది ఉపాసన.దానిపై అప్పట్లో బాగా విమర్శలు వచ్చాయి.
తాజాగా మరోసారి నెటిజన్ల చేత మాటలు పడుతోంది ఉపాసన.ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ విషయాన్ని చెప్పింది.అదేంటంటే.రోగులు మాత్రలు వేసుకునే ముందు మహా మ్రుత్యుంజయ మంత్రాన్ని జపించి వేసుకుంటే ఎఫెక్టివ్ గా పని చేస్తాయని ఎక్కడో చదివినట్లు చెప్పింది.
అయితే హిందువులే కాదు.ముస్లింలు అల్లాను, క్రిస్టియన్లు జీసస్ ను కూడా స్మరించుకుని మందు గోలీలు వేసుకుంటే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని.
రోగులకు విశ్వాసం పెరిగి కోలుకునే శక్తి పెరుగుతుందని చెప్పింది.ఆమె చేసిన ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.
అపోలో గ్రూప్ హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్న ఉపాసన.ఇలాంటి మూడ నమ్మకాలను ప్రమోట్ చేయడం ఏంటని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సైన్స్ ను ప్రమోట్ చేయాల్సిన స్థానంలో ఉన్న ఆమె ఇలాంటి మాటలు చెప్పడం వల్ల తప్పుడు సంకేతాలు జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు.అయితే ఈమెను పలువురు వెనుకేసుకొస్తున్నారు కూడా.
ఆమె చెప్పిన విషయాల్లో తప్పేం లేదంటున్నారు.ఆమె ఎక్కడో చదివాను అని చెప్తుందే తప్ప.
తనే అలా వెల్లడించలేదంటున్నారు.