ఇది దేవర నామ సంవత్సరం.. 1000 కోట్లు కొల్ల కొట్టాల్సిందే: త్రివిక్రమ్ శ్రీనివాస్

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) నటించినటువంటి తాజా చిత్రం టిల్లు స్క్వేర్( Tillu Square ).డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Trivikram Srinivas Interesting Speech About Devara Movie Details,devara Movie,nt-TeluguStop.com

ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్( NTR ) త్రివిక్రమ్ వంటి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సిద్దు సినిమా ఈవెంట్ అయినప్పటికీ ఈ వేదిక మాత్రం పెద్ద ఎత్తున దేవరనామ స్మరణలతో మారి మోగిపోయిందని చెప్పాలి.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) సైతం దేవర సినిమా( Devara Movie ) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.ముందుగా 100 కోట్ల క్లబ్ లో చేరిన సిద్ధుకి కంగ్రాట్స్ అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమా టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు రాధిక స్క్వేర్ కూడా అని అన్నాడు.ఈ సినిమా కోసం ఈయన పడిన కష్టాన్ని త్రివిక్రమ్ ఈ సందర్భంగా తెలియజేస్తూ అభినందనలు వెల్లడించారు.

ఇక ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నానని త్రివిక్రమ్ అన్నాడు.ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి.ఆయన దేవర( Devara ) నామ సంవత్సరాన్ని మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున, ఎన్టీఆర్ కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నానని త్రివిక్రమ్ దేవర సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube