బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి మహేశ్వరి( Maheswari ) ఒకరు.ఈమె వదినమ్మ శశిరేఖ పరిణయం వంటి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
అయితే ప్రస్తుతం ఈమె సీరియల్స్ కి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు.తన కుమార్తె హరిణితో( Harini ) కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నటువంటి మహేశ్వరి రెండోసారి తల్లి కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె తన ప్రెగ్నెన్సీ( Pregnancy ) కి సంబంధించిన గుడ్ న్యూస్ అందరితో పంచుకున్నారు.అప్పటినుంచి తాను ప్రెగ్నెన్సీ సమయంలో ఫాలో అయ్యే డైట్ గురించి అలాగే తీసుకొనే జాగ్రత్తలు గురించి తరచూ వీడియోలు చేస్తూ ఉంటారు.ఇక ఇటీవల కాలంలో ఈమె తన బేబీ బంప్ ఫోటో షూట్ కూడా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే తాజాగా ఈమెకు మరోసారి తన కుటుంబ సభ్యులు ఘనంగా సీమంతపు వేడుకలు(Baby Shower ) చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్వరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఇతర బుల్లితెర నటీనటుల సమక్షంలో ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ప్రస్తుతం తన బేబీ షవర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను మహేశ్వరి ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలు చూసినా అభిమానులు ఈమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.