అఖిల్ బర్త్ డే... మర్చిపోకుండా విష్ చేసిన మాజీ వదిన?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత( Samantha ) అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈమె నటుడు నాగచైతన్యను( Nagachaitanya ) ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు( Divorce ) తీసుకుని విడిపోవడం అనేది జరిగింది.

 Samantha Special Birthday Wishes To Akhil Post Goes Viral Details,samantha,akhil-TeluguStop.com

ఇలా సమంత అక్కినేని కుటుంబం నుంచి దూరంగా వచ్చినప్పటికీ ఇంకా అక్కినేని కుటుంబ సభ్యులతో టచ్ లోనే ఉందని తెలుస్తోంది.ఈమె అక్కినేని కుటుంబ సభ్యులు అయినటువంటి అఖిల్( Akhil ) తో ఇప్పటికీ టచ్ లో ఉన్నారని తనతో తరచూ మాట్లాడుతూ ఉంటారని కూడా తెలుస్తోంది.

ఇకపోతే సమంత అఖిల్ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అఖిల్ సినిమాలు విడుదలైన సమయంలో కూడా సమంత తనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తూ ఉంటారు సమంత తప్పకుండా తనకు శుభాకాంక్షలు చెప్పడం మాత్రం మర్చిపోదు.అలాగే ఈ ఏడాది కూడా మర్చిపోకుండా సమంత అఖిల్ పుట్టినరోజు( Akhil Birthday ) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే సమంత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అఖిల్ ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే అఖిల్. ఈ ఇయర్ నీకు వండర్‌ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను.గాడ్ బ్లేస్ యూ అంటూ ఈమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఈమె చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా తర్వాత మయోసైటిసిస్ కారణంగా ఈమె సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.త్వరలోనే సమంత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube