సీక్వెల్ మాత్రమే కాదు త్రిక్వేల్ తో అదరగొట్టబోతున్న తెలుగు సినిమాలు

టాలీవుడ్ లో ఇప్పుడు సందడి వాతావరణం నెలకొని ఉంది.అందుకు కారణం డీజే టిల్లు( DJ Tillu ) రెండవ భాగం బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో దూసుకుపోవడమే.

 Triquel Movies In Tollywood Dj Tillu Kgf Goodachari Indian Details, Triquel Movi-TeluguStop.com

అయితే ఇది అందరూ ఊహించిందే.డీజే టిల్లు సినిమాతో మొదట పెద్ద విజయం సాధించిన సిద్దు జొన్నలగడ్డ దానికి తాతలాంటి సినిమాను తీస్తాడని ప్రేక్షకులంతా ఎక్స్పెక్ట్ చేశారు.

అందరూ అనుకున్నట్టుగానే రెండవ సినిమాలో కూడా వన్ లైన్ పంచులు అదిరిపోయాయి.

Telugu Adivi Sesh, Shankar, Dj Tillu, Goodachari, Indian, Kgf, Tillu Square, Tol

ఇప్పుడు ఎక్కడ చూసినా వాటి గురించి చర్చ కొనసాగుతుంది.పైగా దీనికి మళ్లీ మూడవ భాగం తీయాలని కూడా అనుకుంటున్నారు.అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా థియేటర్లలో చెప్పేశారు కూడా.

ఇప్పుడు తాజాగా తెలుస్తున్న విషయం ఏమిటి అంటే ఈ సినిమాను ఏడు లేదా ఎనిమిది పార్టులుగా ఒక ఫ్రాంచైజ్ లాగా తీయాలని అనుకుంటున్నాడట ప్రొడ్యూసర్ నాగ వంశీ.

Telugu Adivi Sesh, Shankar, Dj Tillu, Goodachari, Indian, Kgf, Tillu Square, Tol

అయితే ఈ సినిమాతో పాటు వచ్చే సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.అలాగే ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ తో పాటు త్రీక్వెల్స్ సందడి కూడా ఎక్కువైపోయింది.మరి అలా మూడో పార్ట్లుగా వస్తున్న ఆ సినిమాలు ఏంటి అనే విషయాన్ని ఆర్టికల్లో తెలుసుకుందాం.

డీజే టిల్లు గురించి ఇప్పటికే మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వరుసలో ఉన్న మరొక సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్.( Indian ) ఇప్పటికే ఈ సినిమాకి మొదటి భాగం అప్పుడెప్పుడో విడుదల ఈ బ్రహ్మాండమైన విజయం అందుకుంది.అలాగే ఇప్పుడు రెండవ పార్ట్ కూడా షూటింగ్ జరుపుకుంటుంది.అయితే కోలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ పార్ట్ లోనే మూడవ పార్ట్ కూడా షూటింగ్ పూర్తయిందట.

Telugu Adivi Sesh, Shankar, Dj Tillu, Goodachari, Indian, Kgf, Tillu Square, Tol

ఇది మాత్రమే కాదు కే జి ఎఫ్( KGF ) మొదటి రెండు భాగాలు మనం చూసేసాం.దీనికి మూడవ భాగం కూడా స్క్రిప్ట్ రెడీ అవుతుందట.అందుకే ప్రేక్షకులంతా కూడా ఇలాంటి సినిమాలకు కొనసాగింపులు కోరుకుంటున్నారు.ఇదే వరుసలో హిట్ సినిమాకి కూడా వరుసగా పార్ట్స్ గా షూటింగ్ చేస్తున్నారు.దీనికి ఇప్పుడు మూడో భాగం షూటింగ్ జరుగుతుంది.భవిష్యత్తులో అడవి శేష్ గూఢచారి చిత్రాన్ని( Goodachari Movie ) కూడా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఈ సినిమాలు తీసే అవకాశం ఉంది.

దీన్ని బట్టి చూస్తే ఏదైనా హిట్టు ఫార్ములాని రిపీట్ చేయడానికి అటు నిర్మాతలు, ఇటు హీరోలు వెనకాడటం లేదు.పైగా డబ్బులు వస్తాయి అంటే ఎవరికి మాత్రం చేదు చెప్పండి.

ఇలాంటి తరహా పోకడలు ఎక్కువ హాలీవుడ్ లోనే ఉండేవి.ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube