కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకుర్ ( Chinnathekur )లో విషాద ఘటన చోటు చేసుకుంది.ఉగాది రథోత్సవం కార్యక్రమంలో( Ugadi Rathotsavam programme ) సుమారు పదిహేను మంది చిన్నారులు విద్యుత్ షాక్ కు గురయ్యారు.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.బాధితులను హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రథోత్సవం నిర్వహిస్తుండగా రథానికి కరెంట్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్ తగిలిందని తెలుస్తోంది.దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.