సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన ఎంతో మంది సినీ తారలు అర్థాంతరంగా తనువు చాలించారు.మంచి నటులుగా గుర్తింపు పొందినా.
ఆయా కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్నాడు.పలు కారణాలతో చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయ్ కిరణ్
చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఉదయ్ కిరణ్ మంచి సినిమాలు చేసి టాప్ హీరో అయ్యాడు.స్వశక్తితో సినిమాల్లోకి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగాడు.ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలతో డిప్రెషన్ కు గురై 33 ఏళ్ల వయసులో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
కునాల్
ప్రేమికుల రోజు సినిమాతో తెలుగు ప్రజల ఆదరణ పొందాడు కునాల్.ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించాడు.కానీ కుటుంబ సమస్యలతో కునాల్ చనిపోయాడు.30 ఏండ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు.
దివ్య భారతి
చిన్న వయసులోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది దివ్య భారతి.19 ఏండ్లకే ఆత్మహత్య చేసుకుంది.బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.తర్వాత బాలీవుడ్ కు వెళ్లింది.భర్త సాజిద్ నడియావాలాతో గొడవల కారణంగానే దివ్య భారతి ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయి.
సిల్క్ స్మిత
తన ఐటెం సాంగ్స్ తో కుర్రకారు మతి పోగొట్టిన నటి సిల్క్ స్మిత.ఆర్ధిక ఇబ్బందులతో తాగుడుకు బానిసగా మారింది.35 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది.
జియా ఖాన్
వర్మ నిశ్శబ్ద్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన జియా ఖాన్ 25 ఏండ్లకే తనువు చాలించింది. ప్రేమ విఫలం కారణంగానే చనిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయ.తన చావుకి కారణం ప్రేమికుడు సూరజ్ పాంచోలి అని జియా తల్లి ఆరోపించారు.
భార్గవి
అష్టా చెమ్మా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భార్గవి ఆత్మహత్య చేసుకుంది.మంచి నటి అవుతుందని అందరూ అనుకున్నా.ఊహించని రీతిలో సూసైడ్ చేసుకుంది.
అప్పుడు తన వయసు 22 ఏండ్లు.ప్రియుడే తనను చంపాడని ఆరోపణలు వచ్చాయి.
సుశాంత్ సింగ్
తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకున్నాడు.34 ఏండ్లకే ఉరేసుకుని చనిపోయాడు.ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.