యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లుగా దర్శకుడు ఓమ్ రౌత్ చెబుతున్నాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ షూటింగ్ కు కరోనా అడ్డు రావడం లేదని ఇప్పటి వరకు తమ సెట్ లో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
కరోనా వల్ల ఆదిపురుష్ షూటింగ్ కు ఎలాంటి అవాంతం ఏర్పడలేదు అంటూ చెప్పిన ఓమ్ రౌత్ శ్రీరామ నవమి సందర్బంగా స్పెషల్ ఉంటుంది అంటూ గతంలో హింట్ ఇచ్చాడు.కాని నేడు కరోనా పేరు చెప్పి శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పే పోస్టర్ ను విడుదల చేయలేదు.
ఆది పురుష్ ఫస్ట్ లుక్ ను శ్రీరామ నవమి సందర్బంగా విడుదల చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.కాని నేడు ఆ అప్ డేట్ ఏమీ రాలేదు.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ను ఉదయం 7 గంటల సమయంలో ఇస్తున్న విషయం తెల్సిందే.నేడు కూడా ఉదయం 7 గంటల నుండి ఓమ్ రౌత్ ట్విట్టర్ హ్యాండిల్ తో పాటు ఇతర సోషల్ మీడియా పేజీలను సెర్చ్ చేస్తూ ప్రభాస్ అభిమానులు ఎదురు చూశారు.
కాని అనూహ్యంగా ప్రభాస్ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ను చిత్ర యూనిట్ సభ్యులు ఇవ్వలేదు.ఆదిపురుష్ రామాయణ ఇతివృత్తం నేపథ్యంలో తెరకెక్కుతుంది.రాముడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు.కనుక ఖచ్చితంగా శ్రీరామ నవమి సందర్బంగా ఈ సినిమా కు సంబంధించిన అప్ డేట్ లేదా సినిమా లోని ప్రభాస్ లుక్ ను రివీల్ చేస్తారని అంతా ఆశించారు.
కాని అలా ఏమీ జరగలేదు. ప్రభాస్ కొత్త సినిమా కు సంబంధించిన అప్ డేట్ కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.
సినిమా విడుదలకు ముందు మరో శ్రీరామ నవమి కూడా ఉంటుంది.కనుక ఆ నవమికి ఏమైనా ప్రత్యేక పోస్టర్ లేదా మరేదైనా స్పెషల్ విడుదల చేస్తారేమో చూడాలి.