ఇష్టమైన వంటకాన్ని రివీల్ చేసిన స్టార్ హీరో ప్రభాస్.. చరణ్ కు ఛాలెంజ్ విసురుతూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) భోజన ప్రియుడు అనే సంగతి తెలిసిందే.ప్రభాస్ పారితోషికం ప్రస్తుతం 120 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.

 Tollywood Star Hero Prabhas Reveals His Favourite Food Details Here Goes Viral I-TeluguStop.com

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో అనుష్క చెఫ్ గా కనిపించనున్నారు.

Telugu Salaar, Anushka Shetty, Prabhas, Ram Charan, Tollywood-Movie

అనుష్క తనకు ఇష్టమైన వంటకం గురించి చెప్పి దాన్ని ఎలా వండాలో వివరించడంతో పాటు ప్రభాస్ కు రెసిపీ ఛాలెంజ్ ను విసిరింది.అనుష్క( Anushka Shetty ) విసిరిన ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన ప్రభాస్ రొయ్యల పులావ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.అనుష్క నాకు దశాబ్దాలుగా తెలిసినా ఆమెకు ఇష్టమైన రెసిపీ ఏంటో నాకు తెలియదంటూ ప్రభాస్ కామెంట్లు చేయడం గమనార్హం.ఇన్నిరోజులకు అనుష్కకు ఇష్టమైన వంటకం ఏంటో నాకు తెలిసిందని ప్రభాస్ పేర్కొన్నారు.

నా ఫేవరెట్ ఫుడ్ రొయ్యల ఫులావ్ ను ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి అంటూ రొయ్యల ఫులావ్ ఎలా చేయాలో ప్రభాస్ చెప్పుకొచ్చారు.స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) కు రెసిపీ ఛాలెంజ్ ను విసురుతున్నానని ప్రభాస్ కామెంట్లు చేయడం గమనార్హం.

నా ఫ్యాన్స్ అంతా తమకు ఇష్టమైన వంటకాల్ని నాతో పంచుకోండి అంటూ ప్రభాస్ కామెంట్లు చేశారు.

Telugu Salaar, Anushka Shetty, Prabhas, Ram Charan, Tollywood-Movie

ప్రభాస్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ( Miss Shetty Mr Polishetty )ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొనడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ప్రభాస్ తాజాగా సలార్ మూవీ ( Salaar )డబ్బింగ్ పనులను మొదలుపెట్టారు.సలార్1, సలార్2 సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube