టాలీవుడ్ ఇండస్ట్రీలో సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.మహేష్ బాబు ఇతరులతో ఎక్కువగా మాట్లాడరని అయితే మాట్లాడితే మాత్రం ఆయన వేసే పంచ్ లు మామూలుగా ఉండవని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సినిమా రంగంలో మహేష్ బాబుకు అత్యంత క్లోజ్ గా ఉండే దర్శకుడు ఎవరనే ప్రశ్నకు వంశీ పైడిపల్లి ( Vamshi Paidipally )పేరు సమాధానంగా వినిపిస్తుందనే సంగతి తెలిసిందే.
మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహర్షి సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన హీరోలు ఎవరనే ప్రశ్నకు మాత్రం చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి.ఒక సందర్భంలో మహేష్ బాబు ఈ ఇద్దరుహీరోలు ఇండస్ట్రీలో క్లోజ్ అని చెప్పవచ్చు.
మహేష్, జూనియర్ ఎన్టీఆర్ పలు వేదికలపై కలిసి కనిపించిన సంగతి తెలిసిందే.చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా బలమైన స్నేహ బంధం ఉంది.
మహేష్, ఎన్టీఆర్, చరణ్ కాంబోలో ఏ డైరెక్టర్ అయినా సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే రాజమౌళి, నాగార్జున ఈ వార్తలపై స్పందించలేదు.
రాజమౌళి ( Rajamouli )ఈ సినిమా కోసం ఇండోనేషియా నటిని ఎంపిక చేశారని ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారని తెలుస్తోంది.రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
గుంటూరు కారం సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న మహేష్ బాబు తర్వాత సినిమాలతో మాత్రం భారీ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.