అందుకే నా భర్తతో విడాకులు తీసుకున్నానంటున్న సీనియర్ నటి

తెలుగులో దాదాపుగా 1960వ సంవత్సరం కాలం నుంచి ఇప్పటి వరకు తన హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “సీనియర్ హాస్య నటి రమాప్రభ” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే నటి రమా ప్రభ కామెడీ పాత్రలలోనే గాక పలు ఎమోషనల్ పాత్రలలో కూడా నటించి బాగానే మెప్పించింది.

 Rama Prabha, Tollywood Senior Actress, Divorce News, Telugu Actress, Sharath Bab-TeluguStop.com

అయితే ఆ మధ్య  ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.ఇందులో భాగంగా తన వైవాహిక జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

కాగా తనకు సినీ పరిశ్రమలో బాగా సన్నిహితుడు అయినటువంటి ఓ వ్యక్తి ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు పరిచయమయ్యాడని కొద్ది రోజుల్లోనే ఈ పరిచయం కాస్త ప్రేమ వైపు అడుగులేసిందని తెలిపింది.దీంతో ఇరువురి కుటుంబం సభ్యుల సమక్షంలో వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది.

అయితే ఇద్దరి మధ్య పలు మనస్పర్ధలు, విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తెలిపింది.కానీ తన మాజీ భర్త శరత్ కుమార్ పై ఎలాంటి కోపం లేదని తన జీవితంలో ఎలాగైతే రాసిపెట్టి  ఉందో అలాగే జరిగిందని విధి రాతను ఎవరూ మార్చలేరని ఎమోషనల్ అయ్యింది.

అయితే ప్రస్తుతం రమా ప్రభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లిలో నివాసముంటున్నారు సమాచారం.

అయితే సీనియర్ నటి రమా ప్రభ తెలుగు తమిళ కన్నడ మలయాళం తదితర భాషలలో దాదాపుగా 200కు పైగా చిత్రాలలో నటించింది.

ఇప్పటికీ నటిస్తూనే ఉంది.తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఎంతగానో కడుపుబ్బ నవ్వించే రమాప్రభ జీవిత ఇంతటి విషాదం ఉందని ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube