Vikramarkudu 2 : విక్రమార్కుడు 2 రాబోతోందా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత?

దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ) దర్శకత్వంలో రవితేజ( Raviteja ) అనుష్క( Anushka ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం విక్రమార్కుడు( Vikramarkudu ) 2006వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ మాస్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇప్పటికి ఈ సినిమా టీవీలలో వచ్చిన ప్రేక్షకులు కల్లార్పకుండా చూస్తారు అంతా అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ సినిమా సొంతం చేసుకుంది.

 Tollywood Producer Interesting Comments About Vikramarkudu 2-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం వస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా సీక్వెల్ విషయంలో రాజమౌళితో పాటు రవితేజ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని అందుకే ఈ సినిమా సీక్వెల్ ఆగిపోయింది అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా భీమా ప్రొడ్యూస‌ర్ కేకే రాధామోహ‌న్( Producer KK Radhamohan ) రియాక్ట్ అవుతూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు.విక్ర‌మార్కుడు 2( Vikramarkudu 2 ) టైటిల్‌ను మూడేళ్ల క్రితమే తమ బ్యానర్ పై రిజిస్టర్ చేసి పెట్టామని తెలిపారు.

Telugu Rajamouli, Kk Radha Mohan, Raviteja, Sampath Nandi, Vikramarkudu-Movie

ఇక డైరెక్టర్గా సంపత్ నంది( Sampath Nandi ) ని కూడా ఫిక్స్ చేశామని వెల్లడించారు.అయితే ఈ సినిమా సీక్వెల్ చేయాలని మేము ఆత్రుత చూపిస్తున్నప్పటికీ రవితేజ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదని ఈయన వెల్లడించారు.ఇక రవితేజ కనుక ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపితే వెంటనే ఈ సినిమా మొదలవుతుందని ఈయన వెల్లడించారు.అయితే అన్ని కాంబినేషన్స్ ఈ సినిమాకు

Telugu Rajamouli, Kk Radha Mohan, Raviteja, Sampath Nandi, Vikramarkudu-Movie

సెట్ అయితేనే సీక్వెల్ సినిమా చేస్తామని లేకపోతే చేయము అంటూ ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాధా మోహన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇక రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇటీవల ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా పనులలో బిజీ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube