చాలా సినిమాలకు ఫస్ట్ ఒక వర్కింగ్ టైటిట్ ఉంటుంది.అందరూ అదే సినిమా టైటిల్ అనుకుంటారు.
కానీ ఫస్ట్ లుక్ తో టైటిల్ వేరేది అనౌన్స్ చేసి పలుమార్లు అందరికీ షాక్ ఇచ్చారు దర్శకులు.విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఫైటర్ అనే టైటిల్ పెట్టారు.
చివరకు లైగర్ అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు.మన తెలుగు ఇండస్ట్రీలో ముందుగా అనుకున్న టైటిల్ ను కాదని.తర్వాత చేంజ్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫైటర్-లైగర్
విజయ్ దేవరకొండ తాజాగా మూవీ పేరు ఫైటర్ అనుకున్నా చివరకు లైగర్ గా మార్చారు.
ఏజెంట్ శివ-స్పైడర్
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాకు ముందుగా ఏజెంట్ శివ అనుకున్నారు.చివరకు స్పైడర్ అనే పేరు పెట్టారు.
శివమ్-కంచె
క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా కంచె.ఈ సినిమాకు ముందుగా శివమ్ అనే పేరు అనుకున్నారు.
దూకుడే దూకుడు-అతడు
మహేష్ బాబు నటించిన అతడు సినిమాకు ముందుగా దూకుడే దూకుడు అనే పేరు అనుకున్నారు.
వారధి-మిర్చి
ప్రభాస్ హీరోగా చేసిన సినిమా మిర్చి.ముందుగా ఈ సినిమాకు వారధి అనే పేరు పెట్టారు.
చెప్పాలని ఉంది- ఖుషి
పవన్ హీరోగా చేసిన సినిమా ఖుషి.ఈ సినిమాకు ముందుగా చెప్పాలని అనే టైటిల్ ఖరారు చేశారు.
అతడే ఆమె సైన్యం-ఒక్కడు
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతడు సినిమాకు ముందుగా అతడే ఆమె సైన్యం అనే పేరు అనుకున్నారు.
కుర్రోడు లో క్లాస్-చిరుత
మెగాస్టార్ నట వారసుడు రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుత.తొలుత ఈ సినిమాకు కుర్రోడు లో క్లాస్ అనే పేరు అనుకున్నారు.
డేగ-మగధీర
రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా వచ్చిన సినిమా మగధీర.ఈ సినిమాకు డేగ అనే పేరు అనుకున్నారు.
చంద్రముఖి2- నాగవల్లి
రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా నాగవల్లి.ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా చేశారు.ఈ సినిమాకు ముందుగా చంద్రముఖి-2 అనే పేరు పెట్టారు.
దటీజ్ మహాలక్ష్మి- 100% లవ్
నాగచైతన్య హీరోగా చేసిన సినిమా 100% లవ్.ఈ సినిమాకు మొదట్లో దటీజ్ మహాలక్ష్మి అనే పేరు పెట్టారు.
వాడే-ఎవడు
రాంచరణ్ హీరోగా వచ్చిన సినిమా ఎవడు.
ఈ సినిమాకు ముందుగా వాడే అనే పేరు అనుకున్నారు.
రొమాంటిక్ రిషి, మిరపకాయ్
రవితేజ మూవీ మిరపకాయ్ కి ముందుగా రొమాంటిక్ రిషి అనే పేరు అనుకున్నారు.
రచ్చ-ఊసరవెల్లి
జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఊసరవెల్లికి ముందుగా రచ్చ అనే పేరు ఖరారు చేశారు.
బంతి-మర్యాద రామన్న
రాజమౌళి-సునీల్ కాంబినేషన్ లో వచ్చిన మర్యాద రామన్న సినిమాకు ముందుగా బంతి అనే పేరు ఖరారు చేశారట.
దేవుడు-ఖలేజా
మహేష్ బాబు హీరోగా చేసిన సినిమా ఖలేజా.ఈ సినిమాకు దేవుడు అనే పేరు అనుకున్నారట.
శ్రద్ధ- అత్తారింటికి దారేది
పవన్ హీరోగా చేసిన అత్తారింటికి దారేది సినిమాకు శ్రద్ధ అనే టైటిల్ అనుకున్నారట.
.