Gopichand: అంత దమ్మున్న డైరెక్టర్స్ మన తెలుగులో లేరు : గోపీచంద్

ప్రతిఘటన, నేటి భారతం వంటి సంచలన సినిమాలు తీసి తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు టి.కృష్ణ.

 Tollywood Directors Doesnt Have That Guts Says Gopi Chand-TeluguStop.com

అలాంటి ఒక రివల్యూషనరీ ఫిలిం మేకర్‌కు పుట్టిన మ్యాచో స్టార్ గోపీచంద్ తండ్రి పేరుని నిలబెట్టేలా ఒక్క సినిమా కూడా తీయలేకపోయాడు.నిజానికి గోపీచంద్( Hero GOpichand ) చాలా మంచి నటుడు.

విలన్ గా అతడు చూపించిన నటన చాలామందిని ఆకట్టుకుంది.హీరోగా కూడా ఫైట్లు, కామెడీ చేయగలడు, ఎమోషన్స్ బాగానే పండించగలడు.

అయితే హీరోగా అతడు ఫస్ట్‌లో సక్సెస్ అయినా తర్వాత ఫెయిల్ అయిపోయాడు.దాదాపు గత పది ఏళ్లుగా అతడు వరుసగా ఫ్లాపులనే అందుకుంటున్నాడు.

ప్రతి ఫ్లాపు ఎదురైనప్పుడు ఇక అతడి కెరీర్ ముగిసిపోయిందని చాలామంది అనుకుంటున్నారు కానీ ఏదో ఒక అవకాశం అతడికి వస్తూనే ఉంది.అందులో హీరోగా చేస్తున్నాడు కానీ ఆ మూవీ ఫెయిలవుతోంది.


Telugu Bhima, Gopichand, Scripts, Krishna-Movie

రేపు అంటే మహాశివరాత్రి సందర్భంగా ఈ హీరో “భీమా”( Bheema ) సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్ధమయ్యాడు.ఈ సందర్భంగా అతను ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు.ఈ క్రమంలోనే గోపీచంద్ ను ఒక జర్నలిస్టు అదిరిపోయే ప్రశ్న వేశాడు.“ఒకప్పుడు మంచి కాన్సెప్ట్స్‌తో, ప్రజా సమస్యలను చర్చించే సినిమాలు వచ్చేవి.అలాంటి వాటిపై మీలాంటి హీరోలు కూడా ఆసక్తి ఎందుకు చూపించడం లేదు?” అని ప్రశ్నించాడు.దీనికి సమాధానం చెబుతూ తన వద్దకు అలాంటి కథలు రావడం లేదని, వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పాడు.“కాన్సెప్ట్‌లు బాగున్నా వాటిని తెరపై బాగా చూపించగలగాలి, లేని పక్షంలో వాటిని ముట్టుకోకపోవడమే మంచిది.” అని కూడా అతను స్పష్టం చేశాడు.


Telugu Bhima, Gopichand, Scripts, Krishna-Movie

తన తండ్రి టీ.కృష్ణ ఉన్న సమయంలో రచయితలు ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను( Peoples Problems ) బాగా తెలుసుకునే వారని కానీ ఇప్పుడు రచయితలు పాత సినిమాలు( Old Movies ) లేదా ఇతర భాష సినిమాలు చూస్తూ గడిపేస్తున్నారు అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.ఎవరూ ఇప్పుడు జనాల్ని చదవడం లేదని, సమాజంలో తిరిగితే అనేక సమస్యలు తెలుస్తాయని వాటితోనే సినిమాలను తీయొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇలాంటి సామాజిక సమస్యలతో రెండు గంటలు సినిమా తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నట్లు కూడా తెలిపాడు.

చాలామంది గోపీచంద్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.కొందరు మాత్రం రచయితలు( Writers ), దర్శకులకు సమాజంలోని సమస్యల పట్ల కచ్చితంగా అవగాహన ఉంటుందని కానీ అలాంటి సమస్యలతో సినిమా తీస్తానంటే ఏ నిర్మాత ముందుకు రాదని మరికొందరు అంటున్నారు.

ఏదేమైనా తెలుగు డైరెక్టర్లపై గోపీచంద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube