ఈ వయసులోనూ అలాంటి విన్యాసాలు చేస్తున్న జగపతి బాబు... చూస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ తరహా సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Tollywood Actor Shared Jagapathi Babu Variety Photo Goes Viral, Tollywood, Jagap-TeluguStop.com

వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతున్నాడు జగపతిబాబు.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చిన అందులో విలన్ క్యారెక్టర్లలో జగపతిబాబుని నటిస్తున్నాడు.

ఇంతకుముందు హీరోగా నటించినప్పుడు వచ్చిన గుర్తింపుతో పోల్చుకుంటే విలన్ గా నటించినప్పుడు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు.

మొదట లెజెండ్ సినిమాతో సరికొత్తకోనాన్ని చూపించిన జగపతిబాబు ఆ తర్వాత వరుసగా విలన్ క్యారెక్టర్ నటిస్తూ దూసుకుపోతున్నాడు.

నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండడంతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో కూడా ఉన్నాయి.ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో కూడా జగపతిబాబు నటిస్తున్నాడు.ఇకపోతే జగపతిబాబు సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు.అంతే కాకుండా తన ఫిట్నెస్ విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాడు.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో రకాల కొటేషన్లను షేర్ చేస్తూ ఉంటాడు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో జగపతిబాబు ఒక ఫోటోని షేర్ చేశారు.ఆ ఫోటోని షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ ని కూడా రాసుకొచ్చారు.కాగా ఆ ఫోటోలో జగపతిబాబు తలకిందులుగా వేలాడుతూ ఉన్నాడు.ఆ ఫోటోని షేర్ చేస్తూ ఇలా అయినా ఈ లోకం అర్థం అవుతుందేమో అని చూస్తున్నా అనే క్యాప్షన్ కూడా జోడించాడు.ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కాగా ప్రస్తుతం జగపతిబాబు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ మలయాళం హిందీ భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube