కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మహిళల సౌకర్యం మేరకు కేఎస్ ఆర్టీసీకి చెందిన పాత బస్సులను మార్పులు చేర్పులు చేసి అందులో టాయిలెట్లు, మిగిలిన సదుపాయాలు ఏర్పాటు చేసింది.
ఈ టాయిలెట్ బస్సులను రద్దీ ప్రాంతాల్లో ఉంచబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కేఎస్ ఆర్టీసీ మహిళల కోసం అధునాతన సౌకర్యం కలిగిన టాయిలెట్ బస్సులు అందుబాటులో తీసుకొచ్చింది.
ప్రస్తుతం పెరిగిన జనాభా రీత్యా మౌలిక వసతుల ఏర్పాటు ఇబ్బందులు కలుగుతున్నాయి.రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళలకు, గర్భిణులకు అనేక సమస్యలు ఏర్పపడుతున్నాయి.ఈ తరుణంలో మహిళల సౌకర్యార్థం పాత బస్సులను కొన్ని మార్పులు చేసి టాయిలెట్ గా అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ బస్సులో శిశువుకు పాలిచే గదిని ఏర్పాటు చేశారు.
శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మిషన్, తల్లులు తమ పిల్లలు డైపర్లు మార్చడానికి స్థలాన్ని, సోలార్ దీపాలతో బహుళ ప్రయోజనాలు కలిగిన బస్సుగా మార్చారు.ఈ బస్సులు అధునాతనంగా తీర్చిదిద్దటానికి రూ.12 లక్షల వ్యయంతో బస్సును మార్చామని కేఎస్ ఆర్టీసీ పేర్కొంది.పాత బడిన ఆర్టీసీ బస్సులను ఇలా మార్పులు చేసి రద్దీ ప్రాంతాల్లో ఉంచడం జరుగుతుందని వెల్లడించారు.
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ప్రయోగాలు చేస్తున్నామని, సక్సెస్ సాధిస్తే మరిన్ని ప్రాంతాల్లో టాయిలెట్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని కేఎస్ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.