అసలు దొంగలు అప్పుడప్పుడు చేసే పనులు చూస్తేంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.ఎందుకంటే వారు చేసే దొంగతనాలు కాస్త చివరకు ట్విస్టులుగా మారుతుంటాయి.
ఇక దొంగతనాలకు వెళ్లి చాలామంది దొరికి పోతుంటారు.కొందరైతే ఏకంగా కొన్ని ప్లేసుల్లో ఇరుక్కుని యజమానులు వచ్చే వరకు అలాగే ఉన్న ఘటనలు కూడా మనం అనేకం చూస్తున్నాం.
ఇక ఇప్పుడు దొంగ తనానికి సంబంధించిన న్యూస్ ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది.ఎందుకంటే వారు దొంగలించింది ఏదో బంగారమో డబ్బో కాదు ఏకంగా పరమశివుడికి అత్యంత ప్రీతియైన నంది విగ్రహాన్ని.
విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి గోలింగేశ్వర స్వామి టెంపుల్ ఎంతో ఫేమస్ అని అందరికీ తెలిసిందే.కాగా ఈ ఆలయంలో నంది విగ్రహం ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిన విషయమే.
కాగా రెండు రోజులుగా ఈ ఆలయంలోని నంది విగ్రహం ఎవరికీ కనిపించకపోవడం అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఎందుకంటే ఆ విగ్రహం ఉన్న చోట కనీస ఆనవాళ్లు కూడా లేకుండా రాత్రికి రాత్రే కనిపించకుండా పోవడంతో అంతా షాక్ అయ్యారు.
చివరకు ఈ విగ్రహాన్ని కొందరు దొంగలు దొంగతనం చేయడంతో వారంతా షాక్ అవుతున్నారు.ఇక ఇప్ఉపడు కాస్తా శ్రావణమాసం కావడంతో ఆలయానికి వచ్చే వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
అయితే దొంగలు ఆ విగ్రహాన్ని ఎందుకు ఎత్తుకెల్లారో ఎవరికీ అర్థం కావట్లేదు.అసలు ఆ విగ్రహాన్ని దేనికోసం దొంగతనం చేయాల్సి వచ్చిందనే విషయంపై ఇప్పుడు పోలీసులు విచారణ స్టార్ట్ చేస్తున్నారు.
అసలు దొంగలు నందిని తీసుకెళ్లి ఏం చేసుకుంటారు, దాన్ని అమ్మినా కూడా ఎవరూ కొనరు కదా అనే ఇలాంటి డౌట్స్ అనేకం వస్తున్నాయి.మరి దీనిపై పూర్తిగా వివరాలు తెలిస్తే గానీ స్పష్టత రాదు.
ఏదేమైనా ఇలాంటివి నిజంగానే ట్విస్టులుగా ఉంటాయి కదా.