తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanakaraj ) ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ముఖ్యంగా కమలహాసన్ తో చేసిన విక్రమ్ సినిమా అయితే సూపర్ డుపర్ సక్సెస్ ను అందుకుంది.
ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆయనకి పాన్ ఇండియా లో డైరెక్టర్ గా మంచి గుర్తింపు అయితే లభించింది.
ఇక దానికి సంబంధించి ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి రజనీకాంత్( Rajinikanth ) గాని, లోకేష్ కనకరాజ్ గాని వాళ్లని వాళ్లు చాలా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే వీళ్ళు ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక రజనీకాంత్ తమ్ముడు క్యారెక్టర్ లో నాగార్జున( Nagarjuna ) నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరి నాగార్జున లోకేష్ కనకరాజ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే ధనుష్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమాలో( Kubera ) కూడా నాగార్జున ఒక కీలకపాత్ర వహిస్తున్నాడు.
ఇక ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో కూడా చేస్తున్నాడు.కాబట్టి ఈ సంవత్సరం ఆయన గట్టిగానే కొట్టేలాగా అనిపిస్తుంది అంటూ ఆయన అభిమానులు గాని, ప్రేక్షకులు గానీ మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే నాగార్జున లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.ఇక తనకు లక్కీగా ఈ సినిమాతోనే ఆయన సినిమాలో నటించే అవకాశం దొరికింది.ఇక ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఏంటి అనేది ఆఫీషయల్ గా తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…