చిత్రం : తిక్క
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్
దర్శకత్వం : సునీల్ రెడ్డి
నిర్మాత : రోహీన్ రెడ్డి
సంగీతం : తమన్
విడుదల తేది : ఆగష్టు 13, 2016
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, లరిస్సా బొరెస్సి, మన్నారా చోప్రా తదితరులు
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ మంచి ఫామ్ లో ఉంది.“రేయ్” తరువాత పెద్దగా తప్పులు చేయని తేజ్, సుప్రీమ్ తరువాత తన మార్కేట్ ని ఓ మెట్టు పైకి ఎక్కించాడు.మరి సుప్రీమ్ సక్సెస్ తరువాత వచ్చిన తిక్క, ఏమేరకు మెప్పించిందో చూద్దాం.
కథలోకి వెళ్తే …
ఆదిత్య (సాయి ధరమ్ తేజ్) ఒక టిపికల్ కార్పోరేట్ స్టయిల్ ఉద్యోగస్తుడు ప్లస్ లవర్.
ఇతను అంజలి (లరిస్సా)తో ప్రేమలో పడతాడు.ఇద్దరు ప్రేమించుకోని, ఆదిత్య చేసిన తప్పుల వలన విడిపోతారు.ఆ బాధతో ఆదిత్య డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు.ఆ బాధలో ఇచ్చిన బ్రేక్ అప్ పార్టీ ఆదిత్య జీవితాన్నే మార్చేస్తుంది.
తన లైఫ్ లోకి వచ్చిన పాత్రలు మరిన్ని ఇబ్బందులు తీసుకొస్తాయి.వాటిన్నినుంచి ఆదిత్య ఎలా బయటపడ్డాడు అనేది మిగితా కథ.
నటీనటుల నటన గురించి
ఈ సినిమా వరకు తెర మీద ఏదో ఒక మూలన, ఎదో కోశానా, ఒక చిన్నిపాటి ప్లస్ పాయింట్ లేదా సేవింగ్ గ్రేస్ అనేది ఉంటే అది సాయి ధరమ్ తేజ్ మాత్రమే.ఇప్పటివరకు చేసిన క్యారక్టర్లకు భిన్నంగా చేసినా, బలహీనమైన కథ, దర్శకత్వం వలన ఎక్కడా కూడా తన క్యారెక్టర్ కూడా పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు.
లరిస్సా గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.ముంబై నుంచి వచ్చే వాళ్ళనే తట్టుకోవడం కష్టంగా ఉంది.అలాంటిది ఎక్కడో బ్రెజిల్ భామని పట్టుకొచ్చి తెలుగు సినిమా చేయమంటే ఎట్లా! మన్నారా ఇంతకు ముందటి సినిమాల్లాగే నిరాశపరిచింది.
రాజేంద్రప్రసాద్ గారు ఒప్పుకోవాల్సిన క్యారెక్టర్ కాదు, నటించాల్సిన సినిమా కూడా కాదు.
పోసాని, తాగుబోతు రమేష్ ఎప్పటిలాగే మరో తెలుగు సినిమాలో కనిపించారు.
సాంకేతికవర్గం పనితీరు
ఈ సినిమా కోసం అందరికన్నా ఎక్కువ కష్టపడింది, అందరికన్నా బాగా పనిచేసింది ఎవరు అంటే, నిర్మొహమాటంగా తమన్ పేరు చెప్పాలి.
మంచి ఆడియో ఇచ్చి, డీసెంట్ రీరికార్డింగ్ ఇచ్చాడు.అంతా బురదలో పోసిన పన్నీరు లాగా అయిపోయింది.
కెమెరా వర్క్ కూడా ఫర్వాలేదు.ఎడిటింగ్ గురించి అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది.
దర్శకుడు సునీల్ రెడ్డి ఇన్ని అవకాశాల తరువాత కూడా ఒక విజయవంతమైన సినిమాని అందించలేకపోతుండటం నిజంగా విడ్డూరం.ఇంతకుముందు తీసిన సినిమాలు ఒక ఎత్తైతే, తిక్క మరో ఎత్తు.
విశ్లేషణ :
ఏంటో, మంచి సినిమాలకి ఎలాగైతే అన్ని అలా కుదిరేస్తాయో, తిక్క లాంటి సినిమాలకి కూడా అన్ని అలా నెగెటివ్ గా కుదిరేస్తాయి.ఒక్క తమన్ సంగీతం తప్ప సినిమాలో చెప్పుకోవటానికి ఏమి లేదు.
ఇలాంటి వింత వింత క్యారెక్టర్లు ఒకే సినిమాలో ఇరికించాలని దర్శకుడికి ఎలా అనిపించిందో ఎప్పుడు అనిపించిందో కాని ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం సినిమాకి మించిన దారుణం చూడలేము అనుకున్న జనాలకు తిక్క అంటూ మరో సినిమా వదిలాడు.చివరి 20 నిమిషాలు మాత్రం గుడ్డిలో మెల్ల నయం అన్నట్టుగా ఉంటుంది ఈ చిత్రం.
హైలైట్స్ :
* తమన్ ఆల్బమ్
డ్రాబ్యాక్స్ :
* తమన్ సంగీతం, సాయి ధరమ్ తప్ప మిగితావన్ని
చివరగా :
సినిమాలోని పాటలాగా ” ఎక్కలే, చుక్కలే, తొక్కలే”