మలయాళం సూపర్ స్టార్ మరియు సౌత్ లోనే సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ‘జనతా గ్యారేజ్’ లో పాత్ర చేయటానికి కొరటాల శివ,ఎన్టీఆర్ అడగగానే ఒకే చెప్పేసాడు.అంతటి సూపర్ స్టార్ మన యాంగ్ టైగర్ అభిమానులకు కి సారీ చెప్పాడట.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘జనతా గ్యారేజ్’ ఆడియో విడుదల శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సినిమాలో నటించిన నటీనటులు దాదాపుగా అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.
అయితే అనారోగ్యం కారణంగా సమంత.బిజీగా ఉండడం వల్ల మోహన్‌లాల్ ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు.
అందుకే మోహన్ లాల్ ఎన్టీయార్ అభిమానులకు సారీ చెబుతూ ఓ వీడియో బైట్ పంపారు.ఫంక్షన్‌కు రావడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేశాను.కానీ బిజీ షెడ్యూళ్ల వల్ల రావటం కుదరలేదు.ఎన్టీయార్ అభిమానులందరికీ సారీ.
కేరళలో జరిగే ఓనం పండగ సందర్భంగా మా జనతాగ్యారేజ్ సినిమా విడుదల కావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.అంతేకాక ఆ వీడియోలో ఎన్టీయార్ ఈజ్ మై లవబుల్ బ్రదర్’ అని కూడా చెప్పారు.