నిన్న శుక్రవారం జరిగిన ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకలో నిత్యా మీనన్ నోరు స్లిప్ అయ్యింది.ఆమె ఆడియో వేడుకలో మాట్లాడుతూ మొదటిసారిగా పెద్ద స్టార్ హీరోల ప్రాజెక్ట్ లో నటిస్తున్నానని, నాకు ఎప్పటినుంచో పెద్ద హీరోల సినిమా,కమర్షియల్ సినిమాలు చేయాలనీ ఉన్నదని, అది ఇప్పటికి ‘జనతా గ్యారేజ్’ తో సాధ్యం అయిందని చెప్పింది.
అయితే నిత్యా మాట్లాడిన మాటలకు కామెంట్స్ పడిపోతున్నాయి.అల్లుఅర్జున్‌తో కలిసి నటించిన సన్నాఫ్ సత్యమూర్తి, గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన రుద్రమదేవి వంటివి పెద్ద సినిమాలు కాదా అంటూ బన్ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాక ఇలా వేదికలపై మాట్లాడటం కూడా తగదని సూచిస్తున్నారు.అయితే నిత్యా అభిమానులు మాత్రం ఎన్టీఆర్ – మోహన్ లాల్ కాంబినేషన్ ఇంతవరకు రాలేదని….ఏ హీరోయిన్ అయినా మోహన్ లాల్ తో నటించాలని కోరుకుంటుందని…ఆ ఛాన్స్ నిత్యాకు ఈ విధంగా రావటంతో నిత్యా ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు.