వైరల్: సైకిల్ బాగుందికదాని కొట్టేద్దామని బయలుదేరారు... కట్ చేస్తే, రాడ్డు దిగిపోయింది వారికి!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా( Social Media ) జోరు మామ్మూలుగా లేదు.సాధారణంగా ఇక్కడ ఫన్నీ వీడియోలకు మంచి చోటు ఉంటుంది.

 Thieves Struggling To Rob This Cycle Funny Video Viral Details, Viral , Viral La-TeluguStop.com

అప్లోడ్ అయిన వీడియోలోని కంటెంట్ బావుంటే నెటిజన్లు షేర్లు మీద షేర్లు కొడుతూ ఉంటారు.ఇక లైక్స్ అయితే చెప్పాల్సిన పనిలేదు.

ఈ క్రమంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఓ వ్యక్తి తన సైకిల్ ను( Cycle ) లాక్ చెయ్యకుండా పబ్లిక్ లో పార్క్ చేయగా దానిమీద కన్నేసిన తుంటరి దొంగలు( Thieves ) ఖంగు తిన్నారు.

అవును, తన సైకిల్ ను ఎవరూ దొంగిలించకూడదని సదరు సైకిల్ యజమాని సైకిల్ కు కొన్ని సెట్టింగ్స్ చేశాడు.ఈ కారణంగానే దొంగలు ఇక్కడ ముప్పు తిప్పలు పాడడం జరిగింది.

ఓ వ్యక్తి తన సైకిల్ ను పబ్లిక్ గా పార్క్ చేసి సైకిల్ కు లాక్ వేయకుండా దీనికి బదులుగా అతను తన సైకిల్ సీట్ భాగంలో చిన్న మార్పు చేశాడు.దాంతో ఎవ్వరూ దానిని కొట్టే సాహసం చేయలేకపోయారు.విషయం ఏమంటే సైకిల్ సీట్ కింద ఇసుప పైప్ ఒకటి సెట్ చేశాడు.సైకిల్ మీద కూర్చునేటప్పుడు ఆ సెట్టింగ్ ను మార్చుకోవాలి.ఆ విషయం అతనికి మాత్రమే తెలుసు.అది తెలియని ఆ దొంగలు సైకిల్ దొరికిందికదాని వెంటనే దానిమీద కూర్చొని పారిపోదామని ట్రై చేస్తారు.

అయితే అలా సీట్ మీద కూర్చున్నారో లేదో సీట్ కింద ఉన్న ఇనుప పైప్ పైకి పొడుచుకువచ్చి వారి ముడ్డిలో దిగుతుంది.

ఇంకేముంది, కట్ చేస్తే వారు కుయ్యో మొర్రో అని అరుచుకుంటూ అక్కడినుండి బతుకుజీవుడా అని వెళ్లిపోతుంటారు.అయితే ఈ ఎక్స్పరిమెంట్ మనోడు చాలామందిమీద చేసినట్టు ఇక్కడ అర్ధం అవుతోంది.ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు దొంగలు సైకిల్ దొంగతనం చేస్తూ పట్టపగలే చుక్కలు చూశారు.

కాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇరగబడి నవ్వుతున్నారు.ఈ క్రమంలో ‘సైకిల్ దొంగలకు బాగా శాస్తి జరిగింది, ఇలాంటి వాళ్ళు ఉంటారనే సదరు సైకిల్ యజమాని ఇలాంటి జాగ్రత్త తీసుకున్నాడు’ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube