కారులో వెళ్తూ రోడ్డుపై డబ్బులు విసిరారు.. ఎక్కడ చూసినా కరెన్సీ నోట్లే!

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్( Gautam Buddha Nagar in Uttar Pradesh ) జిల్లా నోయిడాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది.నోయిడా ట్రాఫిక్ పోలీసులు( Noida Traffic Police ) నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రహదారిపై ట్రాఫిక్ నిబంధనలను కొందరు ఉల్లంఘించారు.

 They Threw Money On The Road While Going In The Car Currency Notes Everywhere ,-TeluguStop.com

అంతేకాకుండా కదులుతున్న కారు నుండి డబ్బును బయటకు విసిరేశారు.దీనిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఐదు వాహనాలను సీజ్ చేశారు.అన్ని వాహనాలకు రూ.33 వేల చొప్పున లక్షల జరిమానా విధించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.వైరల్ వీడియోలో, ప్రజలు సెక్టార్ -37 నుండి సిటీ సెంటర్ వైపు వచ్చే వాహనాల కాన్వాయ్‌లో డబ్బు విసిరేయడం కనిపించింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఏదైనా విభిన్నంగా చేయాలని చాలా మంది భావిస్తున్నారు.

అయితే ఒక్కోసారి ఇలాంటి పనుల వల్ల చిక్కుల్లో పడుతున్నారు.తాజాగా ఇలాంటి ఓ ఘటన నోయిడాలో జరిగింది.

ఢిల్లీకి( Delhi ) చెందిన కొందరు వ్యక్తులు పెళ్లి కోసం నోయిడా వచ్చారు.ఆ సమయంలో అర్ధరాత్రి నడిరోడ్డుపై హల్ చల్ చేశారు.

తాము ప్రయాణిస్తున్న కార్ల నుంచి భారీగా డబ్బులు విసిరేశారు.అనంతరం ఎక్కడ చూసినా రోడ్డుపై డబ్బులు కనిపించాయి.

వాటిని ఏరుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.

దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నోయిడా పోలీసులు రంగంలోకి దిగారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

నోట్లు నిజమైనవా లేదా నకిలీవా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.వారు విసిరిన నోట్లు నిజమో, నకిలీనో గుర్తించేందుకు విచారణ చేపట్టామని, ఆ నోట్లు నిజమైతే కార్ల పైకప్పు నుంచి ఎంత మొత్తం ఊడిపోయిందనే విషయంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.

ఇతర నిందితుల సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు, ఇతర ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలను స్కాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube