ఏడుకొండలవాడి దర్శనంతో వారికి జ్ఞానోదయం అయ్యింది.. అందుకే ఈ మంచిపనికి పూనుకున్నారు!

మనిషన్నోడు ఎప్పుడు ఏవిధంగా ప్రభావితం అవుతాడో ఎవరికీ తెలియదు.కొందరు తోటి వ్యక్తుల వలన ప్రభావితం అయితే, మరికొందరు కొంతమంది సో కాల్డ్ స్వామీజీల వలన ప్రభావితం అవుతారు.

 They Became Enlightened With The Vision Of The Weeping Man , Paper Cups,suneet-TeluguStop.com

ఇక నేటి యువతయితే, సినిమాలనుండి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు.దురదృష్టవశాత్తు సినిమాలనుండి చెడు విషయాలనే గ్రహిస్తున్నారు.

ఐతే కొంతమందుంటారు… వీరు కేవలం తమ జీవితంలో ఎదురైన సంఘటనల వలన ప్రభావితం అవుతారు.తద్వారా నలుగురికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేపట్టడం అనేది జరుగుతుంది.

ఇప్పుడు తెలుసుకోబోయేది అలాంటివారి గురించే.

ఓ ఇద్దరు కుర్రాళ్లు ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లారు, దేవుడి దర్శనం కోసం.

ఒకరోజంతా అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేసారు.కాగా ఆ రోజంగా వాళ్ళు, వాళ్ళ స్నేహితులు సుమారు 25 లీటర్ల వరకు నీరు తాగారట.

అదే వాళ్లల్లో పెను మార్పును తీసుకొచ్చింది.ఒక్కరోజులో తాము ఇన్ని ప్లాస్టిక్‌ బాటిళ్లు వాడితే, దేశవ్యాప్తంగా ఎన్ని బాటిళ్లు వాడుతారో అని లెక్కేసుకుని ఆశ్చర్యపోయారట.

ఈ క్రమంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలనే ఆలోచనతో అప్పుడే వారు చేస్తున్న ఐటీ జాబ్‌కు రిజైన్ చేశారు.రోజుల కొద్ది ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసి చివరకు ఒక ఉపాయానికి వచ్చారు.

Telugu Chaitanya, Friends, Paper Cups, Resign Job, Suneet Tatineni, Latest, Bott

అదేమిటంటే. ఇల్లు, ఆఫీస్, ఇండోర్, అవుట్ డోర్ ఇలా ఎక్కడైనా వాడుకునేలా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.అలా వారికి వచ్చిన ఆలోచ పేరే.“పేపర్‌ బాక్స్‌.” అందులో నీరు నిల్వ చేసేలా ప్రయత్నించి విజయం సాధించారు.వాళ్లే సునీత్‌ తాతినేని, అతని స్నేహితుడు చైతన్య అయినపూడి.

కొన్ని రోజుల శ్రమ ఫలితంగా వారి మెదళ్లలో పుట్టిన ఆవిష్కరణ కారో వాటర్‌.ఇది దేశంలోనే తొలి ఎకో ఫ్రెండ్లీ డ్రింకింగ్ వాటర్ బాక్స్ అని చెబుతున్నారు.85శాతం వరకు ప్లాస్టిక్‌ లేకుండా ఈ కారో బాక్స్‌ తయారు చేయడం జరిగింది.మరలా దీన్ని రిసైకిల్‌ చేయొచ్చు.

ఖర్చుతోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్టు సునీత్‌ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube